Begin typing your search above and press return to search.

నయన కవితలు.. ఎవరికమ్మా??

By:  Tupaki Desk   |   31 Aug 2017 12:50 PM IST
నయన కవితలు.. ఎవరికమ్మా??
X
వెండితెరకు పరిచయమైన మొదట్లో కాస్త చబ్బీ లుక్స్ తో కనిపించి ఆ తర్వాత వరుస సినిమాలతో సౌత్ లోనే టాప్ హీరోయిన్ రేంజుకు ఎదిగిన భామ నయనతార. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో చాలా అమాయకంగా కనిపించేది కానీ సినిమాల ప్రభావం వల్లనో ఏమో గాని ప్రతి సినిమాకి క్యారెక్టర్ ని మార్చినట్టుగా పర్సనల్ లైఫ్ లో లవర్స్ ని చేంజ్ చేస్తూ వచ్చింది.

అప్పుడప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటూ.. లేడి దేవదాసులగా ఫీల్ అవుతోంది. మొదట్లో శింబు.. తరువాత ప్రభుదేవాలతో అమ్మడు సీరియస్ లవ్ స్టోరీలను నడిపిన సంగతి తెలిసిందే. రెండు గాఢ ప్రేమలలో మునిగితేలిన ఈ అమ్మడు ప్రస్తుతం కవితలు రాస్తుకుంటూ.. ఉంటుందట. అంతే కాకుండా ఆ కవితలను త్వరలోనే ఒక పుస్తకంగా రెడీ చేసి రిలీజ్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాల్లోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా ఈ అమ్మడికి బాగానే ఛాన్సులు వస్తున్నాయి. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం కాస్త బాధగా ఉందట. దీంతో సమయం దొరికినప్పుడల్లా బాధపడకుండా కవితలు రాస్తూ కాలాన్ని గడుపుతోందట.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ యువ దర్శకుడితో ఈ మధ్య తెగ తిరిగేస్తుందని వార్తలు రావడమే కాదు వీరి పెళ్ళి కూడా అయ్యిందనేది రూమర్. ఒక వేళ ఈ ప్రేమ నిజమైతే అందులో మునిగి తేలుతూ కవితలు రాస్తుందేమో అంటున్నారు సినీ లవర్స్.