Begin typing your search above and press return to search.

న‌య‌న్ మ‌ళ్లీ బీర్ బాటిల్ ఎత్తింది

By:  Tupaki Desk   |   15 Nov 2015 11:00 PM IST
న‌య‌న్ మ‌ళ్లీ బీర్ బాటిల్ ఎత్తింది
X
వ‌య‌సు పెరుగుతోన్న కొద్ది న‌య‌న‌తార కు క్రేజ్ విప‌రీతంగా పెరుగిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో న‌టించి త‌న హ‌వా ఇంకా చాటుతూనే ఉంది. అటు ఎఫైర్ల‌లో టాప్ ప్లేస్ లో కొన‌సాగుతుంది. అయితే ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ఈ బీర్ బాటిళ్ల గోల మ‌రో ఎత్తైంది. ఆ మ‌ధ్య నానుం రౌడీదాన్ సినిమా కోసం అమ్మ‌డు బీర్ బాటిల్ కొనే ఓ స‌న్నివేశంలో న‌టించింది. దీంతో మ‌హిళా సంఘాలు సొగ‌స‌రిపై భ‌గ్గుమ‌న్నాయి. బాధ్య‌త‌గ‌ల మ‌హిళ‌గా వ్వ‌వ‌హ‌రించాల్సింది పోయి ఇలా యువ‌త‌ను త‌ప్పుడు దోవ ప‌ట్టిచే స‌న్నివేశాల్లో న‌టిస్తుందా? అంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కుంది. అయినా న‌య‌న్ ఆ విష‌యాల‌ను అప్పుడే మ‌ర్చిపోయింద‌ని ఇప్పుడు బ‌య‌ట ప‌డింది.

ఎందుకంటే మ‌రోసారి బీర్ బాటిల్ ఎత్త‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు జీవా స‌ర‌స‌న తిరునాల్ అనే సినిమాలో న‌టిస్తోంది. ఇందులో కూడా బీర ప‌ట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్ లో హ‌ల్ చేస్తున్నాయి. క‌థ‌లో ఆ స‌న్నివేశానికి ప్రాధాన్య‌త ఉండ‌టంతోనే న‌య‌న్ బీర్ బాటిల్ ఎత్త‌డానికి సిద్ధ‌ప‌డింద‌ని తెలుస్తుంది. అయితే యూనిట్ వర్గాలు మాత్రం ఆ స‌న్నివేశం న‌య‌న‌తార‌కు సంబంధించిన‌ది కాద‌ని అంటున్నారు. ఏది ఏమైనా న‌య‌న్ ఇలా బీర్ బాటిల్ తో క‌నిపించ‌డంతో మళ్లీ విమ‌ర్శ‌లు వెల్లు వెత్త‌డం ఖాయ‌మ‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా నయన్‌ బీర్‌ బాటిల్‌ లేపిందంటే ఆ సినిమా హిట్లే అనే సెంటిమెంటుకు తంబీలు వచ్చేసుంటారు.