Begin typing your search above and press return to search.

NETFLIXలో న‌య‌న‌తార పెళ్లి ప్రీమియ‌ర్?

By:  Tupaki Desk   |   5 Jun 2022 5:09 AM GMT
NETFLIXలో న‌య‌న‌తార పెళ్లి ప్రీమియ‌ర్?
X
అందాల న‌య‌న‌తార త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 9న ఈ జంట వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. మహాబలిపురంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం నయన్ పెళ్లి జరగనుందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య విఘ్నేష్ న‌య‌న్ మెడ‌లో తాళి కట్టనున్నట్టు సమాచారం. అదే వేదికపై జూన్ 8 సాయంత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు .. రాజకీయ నాయకుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసారని తెలిసింది.

ఈ పెళ్లికి రజనీకాంత్- చిరంజీవి- కమల్ హాసన్- షారూక్ ఖాన్- అజిత్- విజయ్- సూర్య- కార్తీ- విజయ్ సేతుపతి- విజయ్ సేతుపతి వంటి టాప్ సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది. నయనతార ప్ర‌స్తుతం షారూక్ సరసన జవాన్ సినిమాలో కనిపించనున్నారు. అదే క్ర‌మంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పెళ్లికి హాజరవుతార‌ని ఊహ‌గానాలు సాగుతున్నాయి.

ఇప్ప‌టికే ఈ జంట స్వ‌యంగా ప‌లువురిని గ్రాండ్ వెడ్డింగ్ కు ఆహ్వానించడానికి క‌లుసుకుంటున్నారు. 9 జూన్ 2022న మహాబలిపురంలో జరగనున్న తమ వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు నిన్నటిరోజున‌ నయనతార- విఘ్నేష్ శివన్ ఇద్దరూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. సినీనటుడు.. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కూడా ఆహ్వానించారు.ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోలు.. ఇతర సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు తెలిసింది.

లైవ్ స్ట్రీమింగ్ హ‌క్కులు నిజ‌మా?

జూన్ 9న జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రత్యేకంగా NETFLIXలో చిత్రీకరించి ప్రీమియర్ గా ప్రదర్శిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కి దర్శకత్వం వహించే బాధ్యతను గౌతం మీనన్ కు అప్పగించారని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇదే నిజమైతే OTTలో స్టార్ క‌పుల్ వివాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెసులుబాటు ఉంటుంది.  ఇలా చేయ‌డం ద‌క్షిణ భారత‌దేశ‌ చలనచిత్ర పరిశ్రమలో మొదటిసారిగా క్రేజీగా ఉంటుంది. అయితే ఈ వార్తను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. న‌య‌న్ పెళ్లిపై మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఈ స్పేస్ ను చూస్తూ ఉండండి.