Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: నయన్ చంపేసింది
By: Tupaki Desk | 15 May 2017 11:37 PM ISTమలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన పుదియ నియమం అనే మూవీని తెలుగులో 'వాసుకి'గా డబ్బింగ్ చేస్తున్నారు. గతేడాది మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. అక్కడ బంపర్ హిట్ కొట్టేసింది. నయన్ కు భర్తగా మమ్ముట్టి నటించినా సరే.. ఈ మూవీలో లీడ్ రోల్ నయనతారదే కావడం విశేషం. ఇప్పుడీ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తున్న కాసేపటికే అర్ధమయిపోయే విషయం.. ఇదో క్రైమ్ కహానీ. ఓ ముగ్గురిని చూసి నయన్ భయపడ్డం.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం.. భర్త-కూతురు ఆమె గురించి అనుమానంగా మాట్లాడుకోవడం.. ఆ తర్వాత కరుడు కట్టిన వ్యక్తిగా తాపీగా నడుచుకుంటూ క్రైమ్స్ చేసేయడం.. ఇదీ సింపుల్ గా వాసుకి ట్రైలర్ లో చూపించన కహానీ. ఈ చిత్రానికి నయనతార పాత్ర.. ఆమె నటన చాలా కీలకం. గోపీసుందర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ మూవీని రూపొందించామని నిర్మాత ఎస్ ఆర్ మోహన్ చెబుతున్నారు. సమ్మర్ లోనే వాసుకిని థియేటర్లలోకి తీసుకురావాలన్నది మేకర్స్ యోచన.
ఓ ముగ్గురిని మర్డర్ చేసేందుకు నయనతార ఎలా ప్లాన్ చేసింది.. అసలు వాళ్లను చూసి ఎందుకు భయపడింది.. అందుకు లేడీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎందుకు హెల్ప్ చేసింది.. ఈ కథలో అసలు మమ్ముట్టికి లింక్ ఏంటి అనే కథనం చాలా ఆసక్తికరంగాను.. అంతకు మించిన థ్రిల్లింగ్ గాను ఉంటుందని చెబుతున్నారు.