Begin typing your search above and press return to search.

కర్ణాభరణంతో నయన్ ఖాయం చేసిందా?

By:  Tupaki Desk   |   4 Jan 2017 12:24 PM IST
కర్ణాభరణంతో నయన్ ఖాయం చేసిందా?
X
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార.. సినిమాల విషయంలో ఎంత డేరింగ్ గా దూసుకుపోతుందో.. పర్సనల్ లైఫ్ లోనూ అంత క్యాచీగా డెసిషన్స్ తీసేసుకుంటుంది. నయనతార ప్రేమాయణం సంగతులు ఫ్యాన్స్ అందరికీ బాగానే తెలుసు.

ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ పీకల్లోతు ప్రేమలో ఉందనే సంగతి పలు ఈవెంట్లలో ప్రూవ్ అయిపోయింది. అసలు వీళ్లిద్దరికీ పెళ్లయిపోయిందని.. అందుకే పెద్ద హీరోలతో సినిమాలకు ప్రమోట్ చేస్తోందనే టాక్ ఉంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడి ప్రవర్తన కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ఖాయం చేసేలా ఎక్కడా మాట్లాడదు కానీ.. ఖండించేందుకు కూడా ప్రయత్నించదు. అయితే.. తాజాగా అమ్మడు ధరించిన ఓ కర్ణాభరణం ఈ తరహా వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం అమ్మడి చెవికి కనిపిస్తున్న ఇయర్ రింగ్ లో కేవలం 'వి' అనే ఇంగ్లీష్ అక్షరం మాత్రమే కనిపిస్తోంది.

ఆ అక్షరమే ప్రస్ఫుటంగా కనిపించేలా ఫోటోలకు పోజులు ఇస్తోంది కూడా. ఈ 'వి' కి అర్ధం తన ప్రియుడు విఘ్నేష్ శివన్ అని అర్ధాలు తీసేస్తున్నారు జనాలు. మరి నయన్ ఉద్దేశ్యమేంటో బయటకు చెప్పదు కాబట్టి.. ఏమైనా సరే మీరే ఊహించేసుకోండి అన్నట్లుగా ఉంటుంది నయన్ వాలకం. ఇప్పటికే పెళ్ళయిపోయిందని కూడా రూమర్లు వస్తున్న తరుణంలో.. అమ్మడు మాత్రం సైలెంట్ గానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/