Begin typing your search above and press return to search.
'తగ్గేదేలే' అంటున్న నయనతార!
By: Tupaki Desk | 20 Nov 2021 8:16 AM ISTనయనతార ప్రపంచం వేరు .. తాను ప్రేమించేవారు తప్ప అక్కడ ఎవరూ కనిపించరు. అలాగే వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆసక్తిని ఆమె చూపించదు. కథలు తప్ప ఆమె ఇతర విషయాలు ఏమీ వినదు. తనకి సంబంధించిన పనులను గురించి తప్ప వేరే విషయాలను పట్టించుకోదు. తన సినిమాలు భారీ విజయాలను సాధించినప్పుడు ఎలా ఉంటుందో .. భారీ పరాజయం పాలైనప్పుడు కూడా ఆమె అలాగే ఉంటుంది. అలా అన్నిటికి అతీతంగా ఉండటం .. అంతటి నిబ్బరాన్ని కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం.
తాను ఒప్పుకున్న సినిమాల విషయంలో తనవైపు నుంచి ఎలాంటి తప్పులేకుండా చూసుకుంటుంది. తన సినిమా బాగుంటుంది చూడమని చెప్పే ప్రమోషన్స్ లో ఆమె ఎక్కువగా కనిపించదు. నిర్మాతలకు ఆ విషయాన్ని ముందుగానే చెబుతుంది. నయనతార ఓకే అనడమే గొప్ప విషయం గనుక, ఇతర విషయాలను గురించి నిర్మాతలు ఆమెను ఒత్తిడి చేయరు. ఇక దర్శకులుగా అనుభవం ఉన్నవారే హిట్ ఇస్తారనే విషయాన్ని కూడా ఆమె నమ్మదు. కథ కొత్తగా ఉంటే కొత్త దర్శకుడికి ఓకే చెప్పడానికి కూడా ఆమె ఎంతమాత్రం ఆలోచించదు.
అలాగే కొత్త హీరో జోడీగా చేయడం వలన ఇమేజ్ పడిపోతుందనే సూత్రాన్ని కూడా ఆమె ఎంతమాత్రం పట్టించుకోదు. నటిగా అన్ని వైపుల నుంచి ఇలాంటి సాహసాలు చేయటం వల్లనే ఆమె ఇంత క్రేజ్ తో ఇంత కాలం కొనసాగగలుగుతుంది. సాధారణంగా పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు, అవసరమైతే కొంతమంది హీరోయిన్లు పారితోషికాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. కానీ నయనతార ఆ అవకాశం కూడా ఇవ్వదు. హీరో ఎవరైనా .. భాష ఏదైనా తనకి ఇవ్వవలసిన పారితోషికం తనకి ఇవ్వవలసిందే.
తమిళంలో రజనీ సరసన చేసినా .. మలయాళంలో మమ్ముట్టి సరసన చేసినా .. తెలుగులో చిరంజీవి జోడిగా కనిపించినా ఆమె పారితోషికం విషయంలో మాత్రం మార్పు ఉండదు. అలాగే తాజాగా చిరంజీవితో చేస్తున్న 'గాడ్ ఫాదర్' కోసం కూడా ఆమె 4 కోట్లు తీసుకుంటోందట. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయిక నయనతారనే. ఆ తరువాత స్థానంలో 2 నుంచి 3 కోట్ల మధ్యలో తీసుకుంటూ పూజ హెగ్డే కనిపిస్తోంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ కారణంగా ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఎంతమాత్రం వెనుకాడం లేదు.