Begin typing your search above and press return to search.
నయన్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ అన్నారే!
By: Tupaki Desk | 30 April 2019 2:02 PM ISTసౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నయనతార. ఒకవైపు రజనీకాంత్.. విజయ్.. చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు యంగ్ హీరోలతో కూడా జోడీ కడుతుంది. కమెడియన్ యోగిబాబు తో కూడా నటించి సంచలనం సృష్టించింది నయన్. ఇదిలా ఉంటే రీసెంట్ గా నయన్ బుల్లితెర ఎంట్రీ ఇస్తోందని.. తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించనుందనే వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి.
ముఖ్యంగా కలర్స్ టీవీ బుల్లితెరపై నయన్ అంటూ ఈ ప్రచారం చేపట్టింది. కానీ చావుకబురు చల్లగా చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే నయనతార నటించిన 'ఇమైక నోడిగళ్' చిత్రం మే 12 న ఆ ఛానెల్ లో టెలికాస్ట్ చేస్తున్నారట. దానికోసం సదరు ఛానెల్ అంత హంగామా చేసింది. కానీ అసలు సంగతి ఆ ఛానల్ వెల్లడించేలోపే సోషల్ మీడియాలో బిగ్ బాస్ హోస్ట్ నయన్ అంటూ భారీగా ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారాన్ని చూసి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. నయన్ కాల్ షీట్లే దొరకడం కష్టం.. పైగా నయన తన సినిమా ప్రమోషన్స్ లోనే పాల్గొనదు.. అలాంటిది టీవీ షోలో పాల్గొనడం ఏంటనేది వారి అనుమానం. ఫైనల్ గా వారి అనుమానమే నిజమైంది.
ఏదైతేనేం.. ఈ ప్రచారం విషయంలో గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది. ఇంతవరకూ బిగ్ బాస్ అనగానే హోస్ట్ గా ఎప్పుడు హీరోల పేర్లే వినిపించేవి. ఇప్పుడు మొదటిసారిగా ఒక హీరోయిన్ పేరు వినిపించింది. మరి అందుకేగా నయన్ ను లేడీ సూపర్ స్టార్ అనేది!