Begin typing your search above and press return to search.

వైట్ లో నయన్ వెలుగులు

By:  Tupaki Desk   |   30 Oct 2017 11:00 PM IST
వైట్ లో నయన్ వెలుగులు
X
దక్షిణాది బ్యూటీ నయనతార ఇప్పుడు మంచి జోష్ మీదుంది. ఈమె నటించిన వేలైక్కారన్ చిత్రం.. క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో.. నయన్ లుక్ ను ఇప్పుడు రివీల్ చేశారు.

వైట్ డ్రెస్ లో అందాలు ఒలికిస్తున్న నయనతార లుక్ సూపర్బ్ గా ఉంది. ప్రస్తుతం నయన్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు తన స్టార్ స్టేటస్ ను పెంచుకుంటోంది. ఇంకో రెండేళ్ల పాటు అసలు బ్రేక్ లేకుండా సినిమాలు చేసేసినా.. పూర్తి కానన్ని ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయి. ఈ వేలైక్కారన్ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో.. శివకార్తికేయన్ హీరో కావడంతో.. సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

ఈ వేలైక్కారన్ మూవీలో కూడా నయన్ కేరక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన వైట్ డ్రెస్ లుక్ అదిరిపోయేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కూడా అమ్మడి డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉండడంతో.. ఫోటోకు మరింతగా అందం వచ్చేసింది. 32 ఏళ్ల వయసులోనూ టీనేజ్ బ్యూటీలను సవాల్ చేసే అందాన్ని చూపించేస్తోంది నయనతార.