Begin typing your search above and press return to search.
బాలయ్యకు నో, వెంకీ అయితే ఓకే
By: Tupaki Desk | 26 July 2015 12:57 PM ISTతెలుగు, తమిళ ఇండస్ట్రీలలో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార. టాలీవుడ్ లో అయితే... సీనియర్ హీరోలందరికీ నయన్ కావాల్సిందే. ఎవరి పక్కన నటించినా తగిన జంటగా ఒదిగిపోయినట్లుంటే ఈ సుందరాంగి... ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంటోంది.
ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నయనతారను... బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డిక్టేటర్ కోసం అడిగారు. అయితే... బిజీ షెడ్యూల్ అన్న ఈ భామ.. డేట్స్ ఖాళీ లేవంటూ ఆఫర్ తిరస్కరించింది. దీంతో బాలయ్య పక్కన అంజలి, సోనాల్ చౌహాన్ లను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకున్నారు డిక్టేటర్ టీం.
అంతా బాగానే ఉంది కానీ... ఇప్పుడు నయనతార వెంకటేష్ సినిమాలో నటించేందుకు అంగీకరించడంతో... కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. వెంకీ నెక్స్ట్ మూవీలో చేసేందుకు నయన్ ని అడిగితే.. కొన్ని డీటైల్స్ విన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఈ స్వీటీ. ఇప్పటికే లక్ష్మి, తులసి మూవీల్లో కలిసిన నటించిన ఈ జంట మరోసారి తెరపై చిందేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ కు నో అన్న నయనతార... ఇప్పుడు వెంకీ సినిమాకి ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఒకవేళ కన్‌ఫాం అయితే మాత్రం... ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది నయన్ కు. కేవలం డేట్స్ లేకపోవడం వలెనే అమ్మడు బాలయ్య సినిమా వదులుకుందేమో