Begin typing your search above and press return to search.
నయన్ మరీ.. ఇంత కాస్ట్లీనా..?
By: Tupaki Desk | 4 Oct 2016 11:00 PM ISTహాట్ హీరోయిన్లలో నయనతార రూటు కాస్త సపరేటు. తెర మీద ఆమె పండించే గ్లామర్ తో పిచ్చెక్కిపోయే జనాలకు.. రియల్ లైఫ్ లో ఆమెకు సంబంధించిన సంగతులు.. తరచూ ఆమెను కనెక్ట్ అయ్యేలా చేస్తుంటాయి. తెలుగు హీరోయిన్లకు సంబంధించి మరే హీరోయిన్ మీద రానన్ని గాసిప్పులు.. ప్రేమాయణాలు నయన్ పేరిట వినిపిస్తాయి. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా.. పెద్ద ఎత్తున అభిమానుల్ని మాత్రం సొంతం చేసుకున్నారు. వయసు మీద పడుతున్నా.. తగ్గని గ్లామర్ అందాలతో అభిమానుల్ని తన బంధీలుగా చేసుకున్న నయన్ ఈ మధ్య చేసిన సినిమాలన్నీహిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాయి.
ఓపక్క తమిళంలో.. మరోపక్క తెలుగులో తనకు తిరుగులేదన్న విషయాన్ని తన సినిమాలతో రుజువు చేస్తున్న ఈ భామ డిమాండ్ ఎంతన్నది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్టార్ హీరోలకు కాస్త అటూఇటూగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నయన్ తీరు ఇప్పుడు నిర్మాతలకు నోట మాట రాకుండా చేస్తుందట. తనకున్న క్రేజ్ ను రెమ్యునరేషన్ రూపంలో రాబట్టుకోవటం నయన్ కు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
ఈ మధ్యన ఆమెను ఒక సినిమా కోసం ఒక నిర్మాత సంప్రదించాడట. కథ ఓకే అంటూనే.. తన రెమ్యునరేషన్ గురించి చెప్పిన అంకె విన్న సదరు నిర్మాత షాక్ తిన్నారట. మొన్నటి వరకూ రూ.3కోట్లు డిమాండ్ చేసిన ఆమె.. తాజాగా తన రేటును రూ.4కోట్లకు పెంచేసిందట. ఆమెకున్న క్రేజ్ గురించి తెలిసిన సదరు నిర్మాత.. ఆమె ఓకే అనటమే గొప్ప అన్నట్లుగా ఫీలై.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన నయన్ రెమ్యునరేషన్ యవ్వారం వింటే.. నయన్ ఇంత కాస్ట్లీనా అనుకోకుండా ఉండలేం కదూ..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/