Begin typing your search above and press return to search.
లేడీ సూపర్ స్టార్ పేరు పెట్టింది ఆమేనట!
By: Tupaki Desk | 2 July 2019 1:38 PM ISTసినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్ద పెద్ద స్టార్లు అసలు పేరుతోకంటే వారి స్టేజ్ నేమ్ తోనే పాపులర్ అవుతారు. మెగా స్టార్ చిరంజీవి.. రజనీకాంత్ లాంటి మెగా సూపర్ స్టార్ల పేర్లే అసలు పేర్లు కావంటేనే ఫిలిం ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు కూడా అసలు పేరు కాదు. నయన్ అసలు పేరు డయానా మరియమ్ కురియన్. కానీ సినిమాల్లోకి వచ్చిన సమయంలో తన పేరును మార్చుకుంది.
రీసెంట్ గా నయన్ పేరు గురించి సీనియర్ మలయాళీ నటి షీలా మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. నయన్ మొదటి సినిమా సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసినక్కరే'. ఆ సినిమాలో హీరో జయరామ్. ఆ సినిమా రిలీజ్ సమయంలో దర్శకుడు సత్యన్ డయానా పేరును మారిస్తే బాగుంటుందని అలోచించి అదే విషయాన్ని జయరామ్.. షీలాకు చెప్పారట. ఏ పేరు పెడితే బాగుంటుందని వారిని సూచించాల్సిందిగా కోరారట. ఆ సమయంలో వారు నయనతార పేరును సెలెక్ట్ చేశారట. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఒక ఈ అమ్మాయి తార లాగా వెలిగిపోవాలనే ఉద్దేశంతో ఆ పేరును సెలెక్ట్ చేసినట్టు చెప్పుకొచ్చింది ఆవిడ. నయన్ చాలా అందంగా ఉంటుందని... మంచి నటి అని ప్రశంసలు కురిపించింది.
ఈ పేరును ఎంపిక చేయడానికి మరో కారణం అన్ని ఇండస్ట్రీలకు సూటయ్యే పేరులాగా అనిపించడమట. బాలీవుడ్ లో అయినా ఈ నయనతార పేరు సూట్ అవుతుందని ఆమె వెల్లడించింది. ఏదైతేనం.. పేరు చలువో లేక నయన్ టాలెంటో.. అదృష్టమో మొత్తానికి నయన్ లేడీ సూపర్ స్టార్ అయింది. మంచిదే కదా! ఇంతకీ ఈ నయన్ కు పేరు సెలెక్ట్ చేసిన షీలా ఎవరనుకున్నారు. మలయాళంలో ఈమె ఒక లెజెండ్రీ యాక్ట్రెస్. మరో మలయాళం లెజెండ్ ప్రేమ నజీర్ తో 130 సినిమాల్లో హీరోయిన్ గా జోడీ కట్టి గిన్నిస్ రికార్డుల బుక్కులో ప్లేసు కొట్టేసిన నటి. ఒకసారి సహాయ నటిగా నేషనల్ అవార్డు కూడా సాధించింది.