Begin typing your search above and press return to search.

టీకాకు ట్రోలింగ్ .. న‌య‌న్ స‌మాధాన‌మిలా!

By:  Tupaki Desk   |   19 May 2021 9:00 PM IST
టీకాకు ట్రోలింగ్ .. న‌య‌న్ స‌మాధాన‌మిలా!
X
అందాల న‌య‌న‌తార త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి నిన్న‌టిరోజున (మే18) టీకాలు వేయించుకున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రి నుంచి టీకాలు వేయించుకుంటున్న ఫోటోల‌ను ఆ ఇద్ద‌రూ షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి.

ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని నయనతార ఈ సంద‌ర్భంగా త‌న ఫాలోవ‌ర్స్ ని కోరారు. కానీ ఆమె ఫోటోపై ఊహించ‌నంత‌ భారీ ట్రోలింగ్ ఎదురైంది. ఆ ఫోటోలో టీకా ప్రాసెస్ ఎలా అన్న‌ది స్ప‌ష్ఠంగా క‌నిపించ‌డం లేదు. అది షో-ఆప్ లా.. ఎటువంటి ఇంజెక్షన్ లేదా సూదిని చూపించక‌పోవ‌డ‌మే ఈ ట్రోలింగుకి కార‌ణం.

ఆ ఫోటోలో ఒక నర్సు తన చేతులను నయనతార చేయిపై ఉంచి క‌నిపించారు.. చాలా మంది దీనిని ఫోటో కోసం స్టంట్ అంటూ ట్రోల్ చేశారు. టీకాలు వేసేప్ప‌టి ఒరిజిన‌ల్ ఫోటో కానే కాదు. అయితే ఈ ట్రోల్ పై స్పందిస్తూ న‌య‌న్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. COVID-19 టీకాకు సంబంధించిన‌ ఇంజెక్షన్ .. సిరంజి ఈ ఫోటోలో ఉన్నాయి. అయినా నయనతారా ఇలాంటివి నకిలీ చేయవలసిన అవసరం లేనేలేదు అంటూ త‌న బృందం స్పష్టం చేసింది.