Begin typing your search above and press return to search.

నయనతార.. మళ్ళీ ఎప్పటిలానే బిజీగా..

By:  Tupaki Desk   |   19 Jun 2022 5:00 AM IST
నయనతార.. మళ్ళీ ఎప్పటిలానే బిజీగా..
X
తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నయనతార ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కొనసాగుతున్న వీరి పెళ్లి రూమర్స్ కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పెట్టి మళ్ళీ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు దర్శకుడిగా విగ్నేష్ చాలా బిజీ గానే ఉన్నాడు. అలాగే నయనతార కూడా పెళ్లికి ముందే ఓకే చేసిన సినిమాల సంఖ్య కూడా చాలానే ఉంది.

కాబట్టి ఆమె పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చేతిలో చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత వారి కెరీర్ విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సోనమ్.కపూర్ ఇద్దరు కూడా పెళ్లి తర్వాత కొంత బిజీగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ తో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నయనతార ఏ విధంగా అడుగులు వేస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

అసలైతే ఆమె పెళ్లి తర్వాత సినిమాల్లో చేయకపోవచ్చని కూడా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఆమె భర్త ఎలాంటి కండిషన్స్ పెట్టలేదట. నయనతారకు నచ్చినట్లు గానే ఆమె ఎప్పటిలానే సినిమాల్లో చేసుకోవచ్చని కూడా విగ్నేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక నయనతార ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను మరొక వైపు తన సినిమా కెరీర్ ను బ్యాలెన్స్ డ్ గా కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను కూడా ఫినిష్ చేసి ఒక ఏడాది అనంతరం కాజల్ సోనం కపూర్ తరహాలోనే ప్రెగ్నెన్సీ తో కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. తన సినిమా కెరీర్ పర్సనల్ లైఫ్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటోందట. మరి నయనతార అనుకున్నట్లుగానే ముందుకు సాగుతుంది లేదో చూడాలి.