Begin typing your search above and press return to search.
నయన్ హిట్టు సినిమాకి సీక్వెల్
By: Tupaki Desk | 13 Nov 2017 7:36 PM ISTసౌత్ బ్యూటీ నయనతారకు.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బోలెడంత డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే.. అమ్మడి సినిమాలకు విపరీతమైన క్రేజ్. స్టార్ హీరోయిన్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్న నయన్.. అటు కమర్షియల్ మూవీస్ తో పాటు.. ఇటు లేడీ ఓరియెంటెడ్ పిక్చర్స్ లోనూ ఇరగదీసేస్తోంది. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తోంది.
నయనతార రీసెంట్ రిలీజ్ ఆరామ్. గత శుక్రవారం నాడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఇరగదీసేస్తోంది. జిల్లా కలెక్టర్ రోల్ లో నయన్ నటనకు కోలీవుడ్ జనాలు నీరాజనాలు పట్టేస్తున్నారు. వసూళ్ల వర్షం కురిపించేస్తున్నారు. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ ను కూడా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు గోపి నయనార్ చెబుతున్నాడు. ఈ సీక్వెల్ లో కూడా నయన్ నే తీసుకునే ఉద్దేశ్యం ఉందని.. త్వరలోనే ఆమెను కలిసి స్టోరీ చెప్పబోతున్నట్లు తెలిపాడు గోపి. ఆ పాత్రకు మరో హీరోయిన్ ను ఊహించుకోవడం కూడా కష్టం అనే రేంజ్ లో నయనతార పండించేసింది.
మరోవైపు.. ఈ ఆరామ్ మూవీని తెలుగులో కర్తవ్యం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్ వెర్షన్ రెడీ అయినా.. ఇక్కడ సినిమాల జోరు ఎక్కువగా ఉండడంతో.. ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. ఇక్కడ కర్తవ్యం ఇంకా రిలీజ్ కాకుండానే.. అప్పుడే సీక్వెల్ కి కూడా ప్లానింగ్ చేసేస్తుండడం విశేషం.