Begin typing your search above and press return to search.

ప్రేమ దూరమైతే చిన్నాభిన్నమే-నయన్

By:  Tupaki Desk   |   7 Sept 2015 3:15 PM IST
ప్రేమ దూరమైతే చిన్నాభిన్నమే-నయన్
X
నయన్ నోట ప్రేమ గురించి మాటలు వస్తే జనాలకు భలే ఆసక్తి. ఎందుకంటే ఆమె జీవితంలో ఇప్పటికే రెండు సెన్సేషనల్ లవ్ స్టోరీలు ముగిశాయి. ఇప్పుడో ఇంకో ఆసక్తికర లవ్ స్టోరీ నడుస్తోంది. ఎప్పుడూ మీడియాతో మాట్లాడ్డానికి అంతగా ఆసక్తి చూపని నయన్.. చాలా అరుదుగా మాత్రమే తన మనసులోని మాటల్ని బయట పెడుతుంది. అలా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమకు నిర్వచనం చెబుతూ.. ప్రేమలో ఉన్నపుడు, ప్రేమలో విఫలమైపుడు ఎలాంటి అనుభూతులు కలుగుతాయో చెప్పింది. ఆ విశేషాలేంటో తన మాటల్లోనే విందాం పదండి.

‘‘ప్రేమ అన్నది భావోద్వేగాల సమాహారం. సంతోషం, దు:ఖం, బాధ, కోపం.. ఇలా అన్నీ కలగలిసి ఉంటాయి. నిజానికి ఇవన్నీ ఉన్న ప్రేమే సక్సెస్ అవుతుంది. వీటిలో ఏది మిస్సయినా వెళితి ఉంటుంది’’ అంటూ ప్రేమను నిర్వచించింది నయన్. రెండుసార్లు బ్రేకప్ బాధను అనుభవించిన నయన్ ను ఇంతకీ ప్రేమ విఫలమైతే ఏంటి పరిస్థితి అని అడిగితే.. ‘‘అంతకన్నా బాధ మరొకటి ఉండదు. ప్రేమ అనేది జీవితంలోకి రాగానే ఒక రకమైన పాజిటివిటీ జీవితంలో నిండిపోతుంది. కానీ ఆ ప్రేమ దూరమైతే.. జీవితమే చిన్నాభిన్నమైన ఫీలింగ్ కలుగుతుంది. అయినా దాన్ని అధిగమించి ముందుకు పోవాలి. ఎందుకంటే జీవితంలోకి మళ్లీ ప్రేమ వస్తుంది. ప్రేమ విఫలమైనా జీవితం ఉంటుంది’’ అంది నయనతార.

ఐతే నయన్ జవాబులు వింటుంటే జనాలకు రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సంతోషం, దు:ఖం, బాధ, కోపం.. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి లేకపోయినా ప్రేమ విఫలమవుతుందని చెప్పిన నయన్.. శింబు, ప్రభుదేవాల ప్రేమలో వీటిలో ఏది మిస్సయిందో మాత్రం వెల్లడించలేదు. జీవితంలోకి మళ్లీ ప్రేమ వస్తుందని చెప్పడం ద్వారా.. బ్రేకప్ తర్వాత మళ్లీ కొత్త లవ్ స్టోరీ మొదలుపెట్టడం తన స్టయిల్ అని చెప్పకనే చెప్పేసింది మళయాళీ భామ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతండ తమిళ డైరెక్టర్ విఘ్నేష్ తో లవ్ స్టోరీ నడుపుతున్నట్లు రూమర్ లున్న సంగతి తెలిసిందే.