Begin typing your search above and press return to search.
నయనకు దండం పెట్టేస్తున్న నిర్మాతలు..!
By: Tupaki Desk | 6 March 2016 9:00 PM ISTతెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ వెలుగొందిన నటి నయనతార. ముప్పై ఏళ్ళు దాటుతున్న ఈ భామ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ నటిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. రీసెంట్ గా నయన నటించిన తమిళ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. దీంతో ఈ అమ్మడు డిమాండ్ మరింత పెరిగింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న నయన తన రెమ్యునరేషన్ విషయంలో బాగా బెట్టు చేస్తోందని సమాచారం.
ఇప్పటివరకు సుమారుగా రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న నయనతార ఇప్పుడు నాలుగు కోట్లు తీసుకోవాలనే ప్లాన్ లో ఉంది. సినిమాలో హీరోయిన్ గా నటించమని ఎవరు వచ్చి అడిగినా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ చెప్పి, తగ్గే ప్రసక్తే లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. దీంతో ఇటీవల ఈ భామను కలిసిన ముగ్గురు నిర్మాతలు తను చెప్పిన అమౌంట్ కు షాక్ అయ్యారట. ఆమెకో నమస్కారం పెట్టి వేరే హీరోయిన్ కోసం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నయనకు తన కెరీర్ ఎంతో కాలం ఉండదనే భావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి నయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాతలు ముందుకొస్తారో చూడాలి..!