Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం రాలేదు.. త‌లైవా కోసమైనా!?

By:  Tupaki Desk   |   17 Nov 2019 1:13 PM IST
మెగాస్టార్ కోసం రాలేదు.. త‌లైవా కోసమైనా!?
X
న‌య‌న‌తార ఏ సినిమా ఆడియో ఫంక్ష‌న్ల‌లో పాల్గొన‌దు. సినిమా ప్ర‌చారానికి స‌హ‌క‌రించ‌న‌ని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అందుకు నిర్మాతలు ఒకే అంటేనే సినిమాకు సంతకం చేస్తుంది. లేదంటే ఎన్ని కోట్లు ఇస్తామ‌న్నా స‌సేమేరా! అనేస్తుంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన సైరా న‌ర‌సింహహారెడ్డిలో ఆయ‌న‌కు జోడిగా న‌టించింది. చిరు తెలుగులోనే నెంబ‌ర్ వ‌న్ హీరో. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న‌య‌న్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతుంద‌ని భావించారంతా. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. అన్ని సినిమాల్లోనే సైరా న‌య‌న్ లైట్ తీసుకుంది.

ప్ర‌స్తుతం న‌య‌న‌తార సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ద‌ర్బార్ లో న‌టిస్తోంది. ఏ. ఆర్ మురగ‌దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 7న ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం చెన్నైలో భారీ ఎత్తున నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ర‌జ‌నీకాంత్ స‌హా ప‌లువు స్టార్ హీరోలు వేడుక‌లో భాగం కానున్నారు. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార.. సూప‌ర్ స్టార్ కోస‌మైనా వేడుక‌లో భాగ‌మ‌వుతుందా? త‌నదైన‌ స్టైల్లో ఢుమ్మా కొడుతుందా? అన్న దానిపై కోలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

న‌యన్ ఇప్ప‌టివ‌ర‌కూ ఓ స్థాయి హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఆ హీరోల వ‌య‌సుకు -ర‌జనీ వ‌య‌సుకు చాలా వ్యత్యాసం ఉంది. అందువ‌ల్ల చిన్న హీరోల‌కు న‌య‌న్ హాజ‌రు కాక‌పోయినా కోలీవుడ్ మీడియా పెద్దగా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సూప‌ర్ స్టార్ సినిమా కాబ‌ట్టి హాజ‌ర‌వ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సినిమాకి సంబంధించిన యూనిట్ అంతా హాజరై న‌య‌న్ రాక‌పోతే త‌ల బిరుస‌నే విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి ఆ విమ‌ర్శ‌ల‌కు తావిస్తుందో? ప‌ట్టించుకోకుండా షాకిస్తుందో చూడాలి.