Begin typing your search above and press return to search.

వీడియో : ఈ స్టార్‌ హీరోయిన్‌ ను గుర్తించండి

By:  Tupaki Desk   |   25 Nov 2019 5:56 PM IST
వీడియో : ఈ స్టార్‌ హీరోయిన్‌ ను గుర్తించండి
X
ప్రస్తుతం సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ఈమె ఎవరో గుర్తు పట్టారా.. చాలా మంది గుర్తు పట్టి ఉండరు. ఈమె మరెవ్వరో కాదు మన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార. ఈమె సినిమాల్లోకి రాకముందు బుల్లి తెరపై కనిపించింది. మలయాళి టీవీ ఛానెల్‌ లో ఈమె చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్‌ గా చేసింది. అవి పెద్దగా ఫేమస్‌ అవ్వలేదు. కాని ఇప్పుడు ఆ యాంకరింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వచ్చాయి.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం అయ్యి ఉంటుంది. ఆ వీడియోల్లో అసలు ఉన్నది నయనతారేనా అన్నట్లుగా అనుమానం కలుగుతుంది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఆ వీడియోలు నయన్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. నయతార గురించిన ప్రతి విషయంను కూడా ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఈ వీడియోను కూడా ప్రేక్షకులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ వీడియో ఎప్పుడు.. ఏ టీవీలో వచ్చింది అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నయనతార రజినీకాంత్‌ 'చంద్రముఖి' చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. గజినీతో పాటు తెలుగులో నటించిన పలు సినిమాలతో నయన్‌ స్టార్‌ డం ను దక్కించుకుంది. ప్రస్తుతం తమిళంలో ఈమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఏకంగా అయిదు నుండి ఏడు ఎనిమిద కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో వందకు రెండు వందలకు యాంకరింగ్‌ చేసిన నయన్‌ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలను తీసుకుంటూ సినిమాల్లో నటిస్తూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఎంత తేడా ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి : https://twitter.com/i/status/1197550064547155968