Begin typing your search above and press return to search.

సైరా నరసింహా రెడ్డి లో లేడీ విలన్ ఆమెనా!

By:  Tupaki Desk   |   24 Sep 2017 4:40 AM GMT
సైరా నరసింహా రెడ్డి లో లేడీ విలన్ ఆమెనా!
X
ఖైదీ నంబర్ 150వ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి లేటు చేయకుండానే 151ని స్టార్ట్ చేశాడు. సైరా నరిసింహా రెడ్డిగా అభిమానులు ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రాయలసీమకి చెందిన స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నాడు. సురేంద్రరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే సైరా నరిసింహారెడ్డి టైటిల్ లోగో లాంఛ్ ని విడుదల చేస్తూ ఈ చిత్రంలో బిగ్ బి అమితాబచ్చన్ - నయనతార - ప్రగ్యజైస్వాల్ తదితరులు నటిస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఇందులో నయనతార ఓ నెగిటిల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలిసింది. చిరంజీవికి థీటుగా నయనతార క్యారెక్టర్ ఉంటుందని సినీ జనాలు అంటున్నారు. ఓ లేడీ విలన్ రేంజ్ లో నయన్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని విశ్వసీనియ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపున నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ప్రగ్య జైస్వాల్ ఈ చిత్రంలో అమితాబ్ కూతురిగా నటిస్తోందని, నిడివి పెద్దగా లేకపోయినా కథని కీలక మలుపు తిప్పే పాత్రలో ప్రగ్య నటిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. పూర్తిగా హాలీవుడ్ నిపుణులు పర్యవేక్షణలో సైరా నరిసింహారెడ్డి తెరకెక్కుతోంది. మరి స్వత్రంత సమరయోధుడు సైరా నరసింహా రెడ్డిగా మెగాస్టార్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి!