Begin typing your search above and press return to search.

నయనకు ఇన్నేసి ఆఫర్లు ఎలా వస్తున్నాయి..?

By:  Tupaki Desk   |   17 May 2016 7:00 AM IST
నయనకు ఇన్నేసి ఆఫర్లు ఎలా  వస్తున్నాయి..?
X
నాటీ నయనతార కెరియర్ అయిపోయిందని మొన్నామధ్య వరకూ అంతా... అంతలేసి మాటలు అనేసారు.ఒక విధంగా చెప్పాలంటే ఆ టైమ్లో ఆవిడగారిపై వచ్చిన మాటలన్నీ రీజనబుల్ గానే ఉన్నాయి.చంద్రముఖి నుంచి పదేళ్లపాటు సినిమాల మీద సినిమాలు చేసి.. రకరకాల కాంట్రవర్సీల్లో పడి లేచి....సీనియర్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసేసి..ఇక చాలు అన్న ఫీల్ ను ప్రేక్షకుల్లో కలుగ చేసింది.దీనికి బలాన్ని చేకూర్చేలా ముగ్గురితో పెళ్లి మ్యాటర్ ను కూడా తీసుకు వచ్చింది.ఓ సినిమా తార తన లైఫ్లో ఇన్ని సినిమాలు చూపించాక ఆవిడపై సినీ ప్రేక్షకులకు ఆటోమేటిక్ గానే రొమాంటిక్ ఫీల్ పోతుంది.అందుకే మన టాలీవుడ్లో నయన్ కు బ్యూటీ పాత్రలు ఇవ్వకుండా తల్లి పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారు.

కాని అదేమి విచిత్రమో.... కోలీవుడ్లో మాత్రం అమ్మడికి తనకంటే ఏజ్ లో చిన్నవారైనా హీరోలతో రొమాంటిక్ సినిమాలు చేసుకునే అవకాశాలొస్తున్నాయి. నయన్ పై తెలుగు జనాలకు మొఖం మొత్తితే... తమిళులకు మాత్రం ఈవిడగారు ఇంకా ఆరాద్య దేవతగానే కొనసాగుతుంది.. నయనను ఫస్ట్ నుంచి చూస్తోన్న అరవ బ్యాచ్ కు నయన్ లోని ఇంకా ఆ రొమాంటిక్ యాంగిల్ పై ఇంకా ఎలాంటి వైరాగ్యం రానట్లుంది.

తమిళ తంబీల మైండ్ సెట్ చూసిన నయన ఇపుడు పనిలో పనిగా తనకు టాప్ హీరో విజయ్ తో చేయాలని ఉందంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.ఇక నయన్ కు ఇన్ని ఆఫర్లు రావడం వెనుక మరో రీజన్... ఆమె ఫిగర్ బాగుంటుందనో లేక అంతకు మించి మరేదో ఆఫర్ చేస్తుందనో కాదు..... కేవలం నయన్ యాక్ట్ చేసే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కురిపించడం.