Begin typing your search above and press return to search.
నయన్ 1000కోట్ల ప్రాజెక్టుల కథేమి!
By: Tupaki Desk | 10 Sept 2018 10:10 AM ISTలేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రాజెక్టుల లైనప్ పరిశీలిస్తే షాక్ తగలకుండా ఉండదు. దాదాపు 1000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు నయన్ కమిటైంది. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే .. వందల కోట్లు వసూళ్లు కొల్లగొట్టేవే..! అగ్రకథానాయకులకు ఏకైక ఆప్షన్ గా నయన్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. సౌత్ లో వేరొక అగ్రకథానాయిక ఎవరూ నయన్ కాలిగోటిని కూడా టచ్ చేయలేరంటే నమ్మండి. అందుకే షి ఈజ్ తలైవి.
ఓవైపు సోలో నాయికగా తడాఖా చూపిస్తూనే - మరోవైపు సౌత్ లో అన్ని క్రేజీ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంటూ నయన్ ఆడుతున్న ఆట మామూలుగా లేదు. అటు రజనీకాంత్ - అజిత్ - ఇటు చిరంజీవి - బాలయ్య - వెంకీ ... హీరో ఎవరైనా నయన్ వైపు చూడాల్సిందే. అవకాశం ఇవ్వాల్సిందే. ఇప్పటికిప్పుడు మెగాస్టార్ చిరంజీవి `సైరా-నరసింహారెడ్డి`లో రాణి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మరోవైపు కమల్ హాసన్ సినిమా `భారతీయుడు -2`లో నయనతార కథానాయిక అంటూ ప్రకటించారు. ఆ సినిమా ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని శంకర్ & లైకా టీమ్ ప్రకటించింది.
వీటితో పాటు అజిత్ సరసన నటించిన `విశ్వాసం` త్వరలో రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమాని దరువు శివ దాదాపు 80కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగానే 150కోట్ల రేంజు అజిత్ కి ఉంది. 200కోట్లు కొల్లగొట్టే లెవలు తళాకి కొత్తేం కాదు. ఈ సినిమాలతో పాటు రైజింగ్ స్టార్ శివకార్తికేయన్ సరసన నయనతార ఓ చిత్రంలో నటిస్తోంది. రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా దర్శకత్వంలో `కోలైయుధిర్ కాలమ్` అనే చిత్రానికి కమిటైంది. మలయాళంలో ఓ లవ్ యాక్షన్ డ్రామాలో నటిస్తోంది. వీటన్నిటి బడ్జెట్ విలువ 1000 కోట్లు పైమాటే. ఇవన్నీ వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న ప్రాజెక్టులే. నయనతారనా మజాకానా?