Begin typing your search above and press return to search.

నయన్.. ఇలా రెచ్చిపోతోందేంటి?

By:  Tupaki Desk   |   13 Oct 2015 11:00 PM IST
నయన్.. ఇలా రెచ్చిపోతోందేంటి?
X
30 ప్లస్‌ లో హీరోయిన్‌ గా కొనసాగడమే కష్టం. కానీ నయనతార మాత్రం వరుసగా సూపర్ హిట్లతో.. ఇబ్బడిముబ్బడిగా అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో కలిపి దాదాపు అరడజను సినిమాలు నయన్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో అరడజను మంది దర్శకులైనా ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నయన్ పట్టిందల్లా బంగారమే అవుతోంది మరి.

కొన్ని నెలల కిందటే మలయాళంలో ‘భాస్కర్ ద రాస్కెల్’ రూపంలో సూపర్ హిట్టు కొట్టింది నయన్. ఆ తర్వాత నెలన్నర క్రితం జయం రవి సరసన నటించిన ‘తనీ ఒరువన్’ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మొన్న వినాయక చవితికి నయన్ లీడ్ రోల్ చేసిన ‘మాయ’ కూడా సెన్సేషనల్ హిట్టయింది. ఇందులో నయన్ పెర్ఫామెన్స్‌ గురించి ఎక్కడ చూసినా ప్రశంసలే. తమిళనాట నాలుగో వారంలో కూడా ఆ సినిమా అదరగొడుతోంది.

ఇప్పుడిక ఇదే నెలలో విడుదల కాబోయే నయన్ కొత్త సినిమా ‘నానుమ్ రౌడీ దా’ మీద కూడా భారీ అంచనాలున్నాయి. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో నయన్.. విజయ్ సేతుపతి సరసన నటించింది. ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. నయన్ ఖాతాలో మరో హిట్టు ఖాయం అంటున్నారంతా. ఇందులో నయన్ చెవిటి అమ్మాయిగా నటిస్తుండటం విశేషం.