Begin typing your search above and press return to search.

ఇరుమగన్ ని లక్కీ లెగ్ కాపాడేసిందా?

By:  Tupaki Desk   |   20 Sept 2016 11:00 PM IST
ఇరుమగన్ ని లక్కీ లెగ్ కాపాడేసిందా?
X
సినిమాలు ఆడకపోతే ఐరన్ లెగ్.. ఆడితే గోల్డెన్ లెగ్ అనే ట్యాగులు తగిలించేయడం సహజంగా జరిగేదే. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి స్టాంపులు ఎక్కువగా ఉంటాయి. కేవలం చెప్పుకునేందుకు కాకుండా.. నిజంగానే నయనతార ఇప్పుడు లక్కీ లెగ్ అయిపోయింది. అమ్మడు కనిపిస్తే చాలు.. కోలీవుడ్ లో సినిమాలు ఇరగదీసి ఆడేస్తున్నాయి.

ఏళ్ల తరబడి హిట్టు కోసం మొహం వాచేటట్లు ఎదురుచూస్తున్నాడు చియాన్ విక్రమ్. చివరకు శంకర్ కూడా విక్రమ్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. కానీ రీసెంట్ గా విడుదలైన ఇరుమగన్(తెలుగులో ఇంకొక్కడు) సూపర్ హిట్ అయిపోయింది. రిలీజ్ అయిన మొదట్లో డివైడ్ కూడా కాదు.. నెగిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా.. రెండో వీకెండ్ అయ్యేసరికి సూపర్ హిట్ అయిపోయిందంటే.. అందుకు కారణం నయనతార లక్కీ లెగ్ అనే మాట వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో నయన్ నటించిన ఏ తమిళ మూవీ కూడా ఫెయిల్ అవడం లేదు. తిరునాళ్.. ఇదు నమ్మ ఆలు.. నానం రౌడీ దాన్.. మాయ.. తని ఒరువన్.. ఇప్పుడు ఇరుమగన్.. ఈ రేంజ్ లో సక్సెస్ లు సాధించేస్తోంది. ఈ టైపులో బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తుంటే.. అభిమానుల సంగతేమో కానీ.. వాళ్ల కంటే ముందే నిర్మాతలే నయన్ కి గుడి కట్టించేస్తారు.