Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత నయనతార ఇంటర్వ్యూ.. పనిలో పనిగా..!

By:  Tupaki Desk   |   22 Dec 2022 3:30 PM GMT
పదేళ్ల తర్వాత నయనతార ఇంటర్వ్యూ.. పనిలో పనిగా..!
X
స్టార్ హీరోయిన్ నయనతార దాదాపు పదేళ్ల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా పెళ్లి తర్వాత కావడంతో ఇంటర్వ్యూలో ఆమె ఏం మాట్లాడారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నయనతార నటించిన 'కనెక్ట్' మూవీ ఈరోజు విడుదల నేపథ్యంలోనే నయనతార మూవీ ప్రమోషన్స్ చేస్తుంది.

పదేళ్ళ నయనతార ఇంటర్వ్యూలో పాల్గొనడంతో యాంకర్ సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత.. వివాహం.. తోటి నటీనటులు విశేషాలన్నీంటిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో నయనతార ఇంటర్వ్యూ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పనిలో పనిగా తాను సినిమాల ప్రమోషన్స్ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో అనే విషయంపై కూడా నయన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కనెక్ట్ మూవీ తెలుగు.. తమిళ సహా హిందీ భాషలో రిలీజు అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు నయనతారను సుమ కనకాల ఇంటర్వ్యూ చేసింది.

ఈ సందర్భంగా వీరిమధ్య పలు ఆసక్తికర సంభాషణలు జరిగాయి. ప్రీ రిలీజ్.. ఇంటర్వ్యూలకు మీరు ఎందుకు దూరంగా ఉంటారని సుమ ప్రశ్నించగా మీరు చాలా బీజీగా ఉంటారు కదా? అందుకే ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు రాలేదని నవ్వుతూ చెప్పింది. మీరు హర్రర్ సినిమాలంటే భయం లేదా? అని ప్రశ్నించగా హర్రర్ చిత్రాలు చూడాలన్నా.. చేయాలన్న ఇష్టమేనని సమాధానం ఇచ్చింది.

కనెక్ట్ లో భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా భయం అనిపించినప్పటికీ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పింది. గాడ్ ఫాదర్ సక్సస్ మీట్ లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నిస్తే.. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని అందుకే రాలేక పోయినట్లు వెల్లడించింది.

కనెక్ట్ కు లాక్డౌన్ కు సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తే.. ఇది లాక్డౌన్ ఓ వైద్యుడి కుటుంబంలో జరిగిన స్టోరీ అని.. దీని ఆధారంగా సినిమాను రూపొందించినట్లు నయన్ చెప్పింది. దర్శకుడు విఘ్నేష్.. నిర్మాత విఘ్నేష్ లో ఏమైనా మార్పులు గమనించారా? అని అడుగగా విఘ్నేశ్ దర్శకుడిగా ఒకలా.. నిర్మాతగా మరోలా ఉంటాడని చెప్పింది.

దర్శకుడిగా ఆయనకు కావాల్సిన సీన్స్.. షూట్స్ పైనే దృష్టి పెడతాడని.. నిర్మాతగా మాత్రం ఎప్పుడైనా షూటింగ్ త్వరగా అయిపోయి వెళ్లిపోతుంటే మరో సీన్ చేయచ్చు కదా? ఎందుకు వెళ్లిపోవడం అంటారని నయన్ నవ్వుతూ చెప్పింది. మీ మధ్య గొడవలు వస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. నేను సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకునేందుకు వెళుతానని చెప్పింది.

టాలీవుడ్ స్టార్ హీరోల గురించి సుమ ప్రశ్నించగా వెంకటేష్ తో పని చేయడమంటే ఒక ఫ్యామిలీతో ఉన్నట్లు ఫీల్ అవుతానని చెప్పింది. తెలుగులో ఆయనే నా తొలి హీరోనని.. మా కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయని తెలిపింది. పెద్ద హీరోతో పని చేస్తున్నాననే భావన ఆయన రానివ్వరని తెలిపింది.

నాగార్జున గురించి ఒక్క పదంలో అందగాడు అంటూ కితాబిచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన తన స్టార్డమ్ ను ఎప్పుడు చూపించరని.. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం ఆయనకే చెల్లిందన్నారు. తోటి నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారని తెలిపింది.

రవితేజ తనకు బెస్ట్ ఫ్రెండ్.. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే కాకపోతే ఎవరి పనుల్లో వాళ్లం బీజీగా ఉన్నామని చెప్పింది. ప్రభాస్ స్వీట్ హార్ట్.. సెట్లో బాగా అల్లరి చేసే వాడని.. సరదాగా ఉంటానని చెప్పింది. ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు.. ఆనందంగా ఉందని చెప్పింది.

ఎన్టీఆర్ బాగా అల్లరి చేస్తాడని.. తనపై జోక్స్ చేసేవాడని చెప్పింది. మంచి డాన్సర్.. రిహాల్సర్ లేకుండానే డ్యాన్స్ చేస్తాడని చెప్పింది. బాలయ్య గురించి మాట్లాడుతూ ఆయన చాలా సరదా మనిషి. ఆయనతో మాట్లాడేందుకు అందరూ భయపడతారు కానీ ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారని.. అందరితో సరదాగా మాట్లాడుతారని నయనతార చెప్పింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.