Begin typing your search above and press return to search.

నయనతారపై కోప్పడితే ఎలా గురూ

By:  Tupaki Desk   |   28 March 2018 11:29 PM IST
నయనతారపై కోప్పడితే ఎలా గురూ
X
కోలీవుడ్ లో మార్చ్ 1 నుంచి అందరే బంద్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ పై నిరసనలు వ్యక్తం చేస్తూ.. ప్రతి ఒక్కరు ఎవరి పనులను వారు ఆపెసుకున్నారు. సినిమాలకు సంబందించిన ఏ పనులలో అక్కడ జరగడం లేదు. దాదాపు అక్కడ కొత్త సినిమా రిలీజ్ అయ్యి నెల అవుతోంది. అగ్ర హీరోలే చాలా సైలెంట్ గా ఉన్నారు. దర్శకులు కూడా ఖాళీగా ఉన్నారు. అయితే నయనతార సినిమా రిలీజ్ కు సన్నాహకాలు మొదలు పెట్టినట్లు తెలియడంతో ఆమె పై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాను కోలీవుడ్ లో వాసుకి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్ పనులు కూడా అయిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో నిరసనలు తెలియజేస్తున్న వారు సైలెంట్ అయిపోతున్నారని టాక్ రావడంతో ఆ సినిమా వాళ్లు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కొన్ని ప్రధాన నగరాల్లో నయనతార పోస్టర్స్ కనిపిస్తుండడం చూస్తుంటే.. బంద్ ఎండ్ అయినట్టే ఉండనే కామెంట్స్ వచ్చాయి. దీంతో నయనతారపై నిర్మాతల కమిటీ నిరసనలు తెలియజేస్తోంది.

ఒక్కరి వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందని నయనతారపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు. కానీ నయనతారకు ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. డబ్బింగ్ సినిమా కాబట్టి తన ఇన్వాల్మెంట్ ఏమి ఉండదు. పైగా ఆమె ప్రమోషన్స్ చేసేరకం కూడా కాదు. అలాంటప్పుడు నయనతార మీద కోప్పడితే ఎలా గురూ అంటున్నారు ఆమె అభిమానులు.