Begin typing your search above and press return to search.
నయన్ కొత్త సినిమా టీజర్ అదిరిపోయింది
By: Tupaki Desk | 19 May 2017 10:58 AM ISTలేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. గత ఏడాది ఆమె చేసిన హార్రర్ థ్రిల్లర్ మాయ/మయూరి మంచి స్పందన రాబట్టుకుంది. హార్రర్ సినిమాల్లో ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ఇప్పుడు నయన్ నుంచి మరో స్పెషల్ మూవీ రాబోతోంది. అదే.. ఇమైక్క నోడిగల్. ఇంతకుముందు ‘డీమాంటీ కాలనీ’ అనే సినిమా తీసిన అజయ్ జ్నానముత్తు ఈ థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేతుల మీదుగా విడుదలైన ‘ఇమైక్క నోడిగల్’ టీజర్.. ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. ఈ టీజర్ కు సోషల్ మీడియాలో చక్కటి రెస్పాన్స్ వస్తోంది.
‘ఇమైక్క నోడిగల్’లో వరుసబెట్టి హత్యలు చేసే ఓ సైకో కిల్లర్ ను పట్టుకునే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నయన్ నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సైకో కిల్లర్ పాత్ర పోషిస్తుండటమే ‘ఇమైక్క నోడిగల్’లో అతి పెద్ద హైలైట్ అని చెప్పుకోవాలి. అనురాగ్ గొప్ప దర్శకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఇంతకుముందు మురుగదాస్ హిందీలో తీసిన ‘అకీరా’లో సైకో పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. ‘ఇమైక్క నోడిగల్’లో సైతం అనురాగ్ పాత్రే హైలైట్ అయ్యేలా ఉంది. టీజర్ అంతా కూడా ఉత్కంఠభరితంగా.. ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. అధర్వ ఇందులో హీరోగా నటించాడు. ఐతే నయనతారే అతణ్ని డామినేట్ చేస్తుందని టీజర్ ను బట్టే తెలుస్తోంది. అధర్వ సరసన టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తుండటం విశేషం. ఆమెకిదే తొలి తమిళ సినిమా. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/