Begin typing your search above and press return to search.

నయనతార సెన్సేషనల్ డెసిషన్!

By:  Tupaki Desk   |   23 March 2017 2:01 PM IST
నయనతార సెన్సేషనల్ డెసిషన్!
X
కెరీర్ ఆరంభంలోనే రజినీకాంత్.. మమ్మట్టి లాంటి సూపర్ స్టార్లతో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటి నయనతార. తమిళం.. తెలుగు.. మలయాళం.. ఇలా మూడు భాషల్లోనూ చాలామంది స్టార్లు.. సూపర్ స్టార్లతో జోడీ కట్టిందామె. తనే లీడ్ రోల్ చేస్తూ హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలతోనూ హవా నడిపించిన ఘనత నయనతారది. 30 ప్లస్‌ లో కూడా ఆమె జోరేమీ తగ్గలేదు. ఇప్పుడు కూడా తన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఒక కమెడియన్‌ కు జోడీగా నటించబోతోందన్న వార్త సంచలనం రేపుతోంది. తమిళంలో కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన సూరితో నయనతార ఒక సినిమా చేయబోతోందట.

ఒక యువ దర్శకుడు సూరి-నయన్ కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుుకుంటున్నట్లు సమాచారం. నయనతారకు ఈ కథ వినిపించగా.. ఆమెకు నచ్చేసి ఓకే చెప్పేసిందట. మూడు కోట్ల పారితోషకానికి హామీ లభించడం కూడా నయన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమని తెలుస్తోంది. కమెడియన్ గా ఎంత స్టార్ స్టేటస్ సంపాదించినప్పటికీ.. నయనతార లాంటి హీరోయిన్ సూరితో నటించడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నయన్ బోల్డ్ డెసిషన్ తీసుకుందని.. ఇది మంచి నిర్ణయమే అని కొందరంటూ ఉంటే కొందరు మాత్రం ఆమె పెద్ద రిస్క్ చేస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్న టైంలో శ్రియ.. వడివేలుతో కలిసి ఒక పాటలో నర్తించడం ఆమె కెరీర్ ను దెబ్బ తీసింది. మరి నయన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/