Begin typing your search above and press return to search.
వెంకీ-చైతులకు జోడి కుదిరిందా
By: Tupaki Desk | 24 March 2018 11:13 AM ISTదగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మొదటి సారి కలిసి నటిస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మేలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. హీరొయిన్ సెలక్షన్ విషయంలో బాబీ ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. వెంకటేష్ సరసన నయనతారను - చైతు పక్కన అతని రియల్ లైఫ్ పార్టనర్ సమంతాను తీసుకునేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒక వేళ ఇదే కనక నిజమైతే హిట్ పెయిర్ రిపీట్ చేసిన సెంటిమెంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. వెంకటేష్-నయనతారది లక్కీ పెయిర్. ఇద్దరు కలిసి గతంలో నటించిన తులసి - లక్ష్మి రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక చైతు పక్కన సమంతా గురించి చెప్పేదేముంది. ఒక్క ఆటోనగర్ సూర్య తప్ప ఈ కాంబో ప్రతి సారి సూపర్ హిట్ కొట్టింది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మిగిలిన తారాగణం, సాంకేతిక వర్గం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వెంకటేష్ యూత్ హీరోలతో నటించేందుకు ఉత్సాహపడుతున్నాడు. తేజ మూవీలో నారా రోహిత్ తో టై అప్ కాగా ఇప్పుడు చైతుతో సై అన్నాడు. గతంలో ప్రేమమ్ మూవీలో ఒకే ఫ్రేంలో కనిపించినప్పటికీ అందులో వెంకీది చిన్న క్యామియో కాబట్టి అది కౌంట్ లోకి తీసుకోలేం. అందుకే ఈ మూవీ చాలా స్పెషల్ గా ఉండబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - రామ్ ఇలా కథ నచ్చితే ఎవరితో చేయడానికైనా వెనుకాడని వెంకీ తన మేనల్లుడితో నటించడం మాత్రం ఫాన్స్ కు భలే కిక్ ఇస్తోంది.
చైతు ఈపాటికే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే సినిమాలో సమంతాతో జట్టు కట్టడానికి ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఓకే అయ్యిందంటే రెండు సినిమాలలో జంటగా నటించే అరుదైన అవకాశం కలుగుతుంది. దీని గురించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్ వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి చేయాలనుకున్న సినిమా గురించిన అప్ డేట్ కూడా వెలువడాల్సి ఉంది.