Begin typing your search above and press return to search.

సినిమా అంతా సింగిల్ శారీతో...

By:  Tupaki Desk   |   3 Dec 2016 5:30 PM GMT
సినిమా అంతా సింగిల్ శారీతో...
X
హీరోయిన్లు సినిమాల్లో ఏ రేంజుల్ డ్రస్సులు మారుస్తారో చూస్తే ఔరా అనిపించకమానదు. లవ్ సీన్స్ లో ఓ టైపు.. పాటల్లో ఓ అరడజన్ .. సెంటిమెంట్స్ సీన్స్ లో ఇంకో రకం.. ఇలా సినిమా మొత్తం మీద కనీసం ఓ 40-50 డ్రస్సుల్లో అయినా చూడముచ్చటగా ఉంటారు. వేసిన డ్రస్ వేయకుండా.. పక్క హీరోయిన్ స్టైల్ మ్యాచ్ కాకుండా.. బోలెడంత అలర్ట్స్ తీసుకుంటారు. కానీ ఓ సినిమా అంతా ఒక హీరోయిన్ ఒకే గెటప్ లోనే కాదు.. ఒకే చీరతో చేయడం అంటే చిన్న విషయమా?

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి మించిన స్థాయిని ఎంజాయ్ చేస్తున్న నయనతార ఈ అరుదైన ఫీట్ సాధించబోతోంది. 'అరమ్' అనే మూవీలో నయన్ కేవలం ఒకే చీరలో కనిపిస్తుందట. జిల్లా కలెక్టర్ రోల్ లో ఈ బ్యూటీ కనిపించనుండగా.. సినిమా అంతా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే కథతో పూర్తయిపోతుంది. ఓ గ్రామానికి నీటి సౌకర్యం లేకపోతే.. ఆ ఊరికి నీరు ఇప్పించేందుకు చేరుకుని.. అది పూర్తయ్యాక అక్కడి నుంచి కదలడమే ఈ సినిమా స్టోరీ.

మధ్యలో ఆరోజు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కాన్సెప్ట్ ని దర్శకుడు మింజూర్ గోపీ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పిక్చరైజేషన్ పూర్తయిపోగా.. త్వరలో రిలీజ్ కి రెడీ అయిపోతోంది 'అరమ్'.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/