Begin typing your search above and press return to search.

నయన్ లక్కు లెక్క బాబు మారుస్తాడా?

By:  Tupaki Desk   |   12 Jun 2016 3:00 PM IST
నయన్ లక్కు లెక్క బాబు మారుస్తాడా?
X
నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె డేట్స్ ఇస్తే చాలు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకైనా నిర్మాతలు సిద్ధం. మరోవైపు పెద్ద పెద్ద ఆఫర్లతో ఆమె దగ్గరకు వెళితే.. డేట్స్ ఎడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో నయన్ ఉంది. ఇదంతా కోలీవుడ్ వరకే పరిమితం. శృతిహాసన్ - సమంత - తమన్నా టైపులో టాలీవుడ్ లో ఈ సుందరాంగికి డిమాండ్ అంతగా లేదు.

నయన్ డిమాండ్స్ - భారీ రెమ్యూనరేషన్ ఒక రీజన్ అయితే.. ఇక్కడ హిట్ పర్సెంటేజ్ మరో కారణం. ఒకటీ అరా మినహాయిస్తే.. టాలీవుడ్ లో నయన్ సృష్టించిన సంచలనాలు పెద్దగా లేవు. అయితే సౌత్ లో టాప్ అనిపించుకోవాలంటే మాత్రం టాలీవుడ్ లో టాప్ స్టేజ్ కి వెళ్లక తప్పని పరిస్థితి. ఇందుకు మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న బాబు బంగారం.. తనకు యూజ్ అవుతుందని నయనతార భావిస్తోంది.

టాప్ హీరోయిన్ అనిపించుకోవాలంటే.. యంగ్ హీరోల పక్కన ఛాన్సులు తప్పనిసరి. గతంలో బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ లతో నటించిన అనుభవం నయన్ కు ఉంది. కానీ.. మహేష్ - చెర్రీ - బన్నీ లాంటి టాప్ హీరోలు ఛాన్సులు ఇవ్వడం లేదు. తని ఒరువన్ ఒరిజినల్ లో నయనతారే చేసినా.. రీమేక్ కి హీరోయిన్ ని మార్చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు బాబు బంగారంలో మాంచి మోడర్న్ గా కనిపిస్తోంది నయన్. దీనితో సక్సెస్ సాధిస్తే.. యంగ్ హీరోలతో ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.