Begin typing your search above and press return to search.
5 కోట్లకు చేరిన నయన్ మార్కెట్?
By: Tupaki Desk | 25 March 2018 1:08 PM ISTతమిళంతో పాటు తెలుగులో కూడా మలయాళ బ్యూటీ నయనతార నటించిన `కర్తవ్యం` హిట్ కావడంతో ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు పొగిడేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నయనతారకు మంచి డిమాండ్ ఏర్పడింది. వాస్తవానికి - శ్రీరామరాజ్యం సినిమా తర్వాత కెరీర్ కు గుడ్ బై చెప్పేదామనుకున్న నయన తార....ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నయనతార వరుస హిట్లతో దూసుకుపోతోంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమాకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు రెమ్యున రేషన్ ను నయన్ డిమాండ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం నయన్...ఓ సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషకం అందుకుందని ఓ తమిళ నిర్మాత వెల్లడించినట్లు తెలుస్తోంది.
తెలుగులో అనుష్క - తమిళంలో నయన తార లు అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తమిళంలో నయన్ కు మంచి క్రేజ్ ఉంది. దీంతో, నయన్ తో తాజాగా ఓ సినిమా నిర్మించిన నిర్మాత....ఆమెకు రూ.5 కోట్లు చెల్లించాడని వినికిడి. అంతేకాకుండా, నయన్ సిబ్బంది ఖర్చు - తిండి ఖర్చులు - ఇతరత్రా ఖర్చులు కలిపి రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు అవుతాయని, వాటితో కలుపుకుంటే దాదాపు రూ. 6 కోట్లు చెల్లించినట్లేనని ఆ నిర్మాత చెప్పాడని తెలుస్తోంది. నయన్ - అనుష్క ల సినిమాలకు తెలుగు - తమిళం - మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. దాంతోపాటు, హిందీలో కూడా వీరి సినిమాలు డబ్ అయ్యే అవకాశముంది. అందుకే, నిర్మాతలు వారిద్దరికీ అంత రెమ్యున్ రేషన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదని టాక్. ఆ హీరోయిన్లకు చెల్లించిన మొత్తం నిర్మాతలు రాబట్టుకోగలుగుతున్నారని, అందుకే భారీ మొత్తం చెల్లించేందుకు రెడీ అవుతున్నారని వినికిడి.