Begin typing your search above and press return to search.
బాడీగార్డ్ దర్శకుడితో నయన్ ములాకాత్
By: Tupaki Desk | 19 March 2015 5:00 AM ISTశ్రీరామరాజ్యం నా చివరి సినిమా. ఇక సినిమాల నుంచి తప్పుకున్నట్టే అని ఎంతో ఉద్వేగంగా చెప్పుకుంది నయనతార. అయితే ఆ తర్వాత అసలు సీను రివర్సయ్యింది. ప్రభుదేవాతో ఎఫైర్ ముగిసిపోవడంతో తిరిగి మనసు మార్చుకుని సినిమాలకు సంతకాలు చేసింది. అలా రెండో ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించేసింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది.
దక్షిణాది అన్ని భాషల్లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో నయన్ కథానాయిక. తాజాగా బాడీగార్డ్ (మలయాళం) దర్శకుడితో మరోసారి పనిచేయడానికి అంగీకరించింది. భాస్కర్ - ది రాస్కెల్ అనే చిత్రంలో నాయికగా నటించడానికి అంగీకరించింది. అయితే ఈసారి నయన్ ఓ కండిషన్ కూడా పెట్టింది. బాడీగార్డ్ మాతృకలో మాత్రమే నన్ను తీసుకున్నారు. మిగతా భాషల్లో వేరే నాయికలకు అవకాశాలిచ్చారు. అలా ఈసారి కుదరదు. భాస్కర్ సినిమాని ఎన్ని భాషల్లో తెరకెక్కించినా నేనే హీరోయిన్. అలా అయితేనే నటిస్తానని నయన్ కండిషన్ పెట్టింది.
లాజిక్ బాగానే ఉంది కదూ. ఆ లెక్కన దక్షిణాది నాలుగు భాషల్లో నాలుగు రీమేక్‌లు చేస్తే అన్నిచోట్లా తనే హీరోయిన్ అన్నమాట! ఆ రకంగా ఇంకో నాలుగేళ్లు తన కెరీర్‌ని పొడిగించుకుందన్నమాట!