Begin typing your search above and press return to search.
బాలయ్యకు ఓకే చెప్పిన నయన్
By: Tupaki Desk | 22 Jun 2017 12:30 PM ISTనందమూరి బాలకృష్ణ జెట్ స్పీడ్ లో సినిమాలు చేసేస్తుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఆరేడు నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసేశారంటే.. బాలయ్య సినిమాల స్పీడ్ అర్ధమవుతుంది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న బాలయ్య.. ఇప్పటికే తన 102వ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
రజినీకాంత్ తో నరసింహ.. లింగ వంటి చిత్రాలను రూపొందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమా తెరకెక్కనుంది. ఇప్పుడీ మూవీలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసేశారట. తమ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు నయనతార అంగీకరించినట్లు నిర్మాత సి. కళ్యాణ్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. గతంలో బాలయ్యతో శ్రీరామ రాజ్యం.. సింహ వంటి హిట్ చిత్రాలలో నటించింది నయనతార. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే మినహా.. సినిమాల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా ఉండే నయన్.. బాలయ్య102కు సైన్ చేసిందనే న్యూస్.. హాట్ టాపిక్ అయిపోయింది.
'జూన్ 27న నందమూరి బాలకృష్ణగారితో సినిమాను లాంఛ్ చేయబోతున్నాం. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. తమిళనాడులోని కుంబకోణం జిల్లాలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది' అని చెప్పిన నిర్మాత కళ్యాణ్.. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ సినిమాకు గౌతమిపుత్ర శాతకర్ణి మ్యూజిక్ డైరక్టర్ చిరంతన్ బట్ ను కూడా తీసుకున్నారట. గతంలో కంచె.. శాతకర్ణి సినిమాలతో తన టాలెంట్ చూపించన ఈ కంపోజర్.. ఇప్పుడు మూడోసారి తెలుగులో వర్క్ చేయనున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/