Begin typing your search above and press return to search.

నయన్ కండీషన్స్.. ఎంతమందికి ఓకె??

By:  Tupaki Desk   |   4 July 2016 7:00 PM IST
నయన్ కండీషన్స్.. ఎంతమందికి ఓకె??
X
స్టార్డమ్‌ లేనప్పుడేమో ఎలాంటి రోల్‌ అయినా చేయడానికి రెడీ అని చెప్పడం. కాస్త బిజీ అయ్యాక మాత్రం నాకు కేవలం యాక్టింగ్‌ స్కోప్ ఉన్న లీడ్ రోల్స్ మాత్రమే కావాలని చెప్పడం. మన హీరోయిన్లకు అనాదిగా వస్తున్న ఆచారమే అది. అందుకే బిజీ అవ్వగానే కాజల్‌ గ్లామర్‌ తగ్గించి కోట్లు కావాలంది.. తమన్నా ప్రాజెక్టులు వదులుకుని బాలీవుడ్ వైపు పరిగెత్తింది. ఇప్పుడు నయనతార కూడా సేమ్ టు సేమ్ ఇదే రూటులోకి వస్తోంది.

మొన్ననే నానుం రౌడీ దాన్ అనే తమిళ సినిమా.. అలాగే భాస్కర ది రాస్కెల్‌ అనే మలయాళ సినిమాలకు గాను.. ఒకేసారి రెండు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది నయనతార. అయితే అమ్మడు ఇప్పుడు తనను ఎప్రోచ్ అయ్యే కొత్త దర్శకులు మరి హీరోలకు ఈ రెండు సినిమాల డివిడి లను ఇస్తోందట. ఈ సినిమాల టైపులో యాక్టింగ్‌ కు స్కోప్ ఉండాలి.. కథ నా చుట్టూరానే తిరగాలి.. అలాగే ఎక్స్ పోజింగ్‌ అనేది ఉండ కూడదు.. అంటూ కండీషన్లన్నీ చెకా చెకా చదివేస్తోందట నయన్. ఈ కండీషన్లకు లోబడి కథనూ పైకాన్నీ ఆఫర్ చేస్తేనే సినిమా సంతకం చేస్తుందట.

తెలుగులో బాబు బంగారం.. తమిళంలో కార్తీతో కాష్మోరా.. విక్రమ్ తో ఇరుమగన్‌ సినిమాలతో వెండితెరపై దండయాత్ర చేయడానికి రెడీగా ఉంది నయన్. ఈ దండయాత్రను చూసి పొంగిపోయి.. ఈమె కండీషన్లకు లొంగిపోయి.. ఎంతమంది సినిమాలు చేతిలో పెడతారో చూడాలి మరి.