Begin typing your search above and press return to search.

నయన్ లేటెస్ట్ కండీషన్స్

By:  Tupaki Desk   |   18 Jan 2017 9:41 AM IST
నయన్ లేటెస్ట్ కండీషన్స్
X
అవకాశాల కోసం తాపత్రయపడటం ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే అవకాశాలు కుప్పలు.. కుప్పలుగా వచ్చి పడుతుంటాయి. కేరళ కుట్టి నయనతార డిమాండ్ ప్రస్తుతం ఇదే తీరులో ఉంది. ఆమె అడగకుండానే అవకాశాలు తన్నుకు వస్తున్నాయి. చేతి నిండా సినిమాలతో ఆమె వ్యవహారం ఇప్పుడో రేంజ్ లో ఉంది.

అందాల ఆరబోతకే కాదు.. సన్నివేశానికి అవసరమైన మసాలాను దట్టించేందుకు ఓకే అనేసే నయన్ ఇప్పుడు కొత్త కండీషన్స్ పెట్టేస్తోంది. తన కాల్షీట్లు కావాలని వచ్చేవారికి ముందు ఆమె మూడు కండీషన్స్ పెడుతుందని చెబుతున్నారు. వాటికి ఓకే అన్నాకే.. ఆమె కథ వినటానికి ఇష్టపడుతుందట. అన్ని విన్న తర్వాత.. తాను పెట్టే కండీషన్స్ కు నో అంటే టైమ్ వృధా అవుతుందన్న ముందుచూపుతో నయన్ తన త్రీ రూల్స్ ను చెప్పేస్తుందట.

ఇంతకీ ఈ బ్యూటీ కండీషన్స్ ఏమంటారా? ఒకటి విచ్చల విడిగా అందాల ఆరబోత అన్నది ఉండదు. స్విమ్ సూట్ కు నో. లిప్ లాక్ కు కుదరదంటూ కండీషన్లు పెడుతోందట. ఇవి పక్కా పాటించాల్సిన రూల్స్ గా ఆమె చెబుతోందట. ఇక.. తన పాత్ర గురించి వివరంగా తెలుసుకొని..అవసరమైతే మార్పులు చేర్పులు చెప్పటం.. దానికి ఓకే అనే కంఫర్ట్ ఉంటే కానీ ఆమె సంతకం పెట్టటం లేదట.ఇన్ని కండీషన్స్ పెడుతున్నా.. నయన్ సంతకం కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. జనంలో డిమాండ్ ఉన్నప్పుడు ఇలాంటివేటికైనా ఓకే అనేస్తారు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/