Begin typing your search above and press return to search.

రెండు రోజులకే 5 కోట్లా?

By:  Tupaki Desk   |   1 Aug 2017 6:25 PM IST
రెండు రోజులకే 5 కోట్లా?
X
సౌత్ బ్యూటీ నయనతార ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎఫైర్స్ తో ఎంత సెన్సేషన్స్ సృష్టిస్తుందో.. సినిమాలతో అంతకు మించి సంచలనాలు నమోదు చేస్తుంటుంది. అయితే.. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. ఈ భామ కెరీర్ మాత్రం ఎప్పుడూ డౌన్ కాలేదు. ఇప్పుడు నయనతార సంచలనాలకే సంచలనం నమోదు చేస్తోంది.

కేవలం రెండు రోజుల షూటింగ్ కోసం ఏకంగా 5 కోట్ల మొత్తాన్ని పుచ్చుకుని రికార్డ్ సృష్టించేస్తోంది నయన్. సినిమాకు 4 కోట్లు పుచ్చుకునే నయనతార.. కేవలం రెండు రోజుల పాటు పాల్గొనే టీవీ కమర్షియల్ కోసం ఇంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుండడం సెన్సేషన్ అవుతోంది. అయితే.. సినిమాల విషయానికి వస్తే షూటింగ్ తర్వాత పబ్లిసిటీ అంటే మాత్రం ఈ భామ అస్సలు కనిపించదు. పైగా తను ప్రచారం చేస్తే సినిమాలు ఫెయిల్ అవుతాయని సెంటిమెంట్ అంటూ నిర్మాతలను బెదిరిస్తుంది. కానీ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ అలా కాదు.. ఈ రెండు రోజుల షూటింగ్ తో పాటు వాళ్ల ఈవెంట్స్ లో కూడా పాల్గొని ప్రచారం చేయాల్సి ఉంటుంది.

ఆయా ప్రోగ్రామ్స్ కు బోలెడంత గ్లామర్ అద్దాల్సి ఉంటుంది. అందుకే అందాల భామలకు అంతేసి మొత్తాలు ముట్టచెబుతాయి కంపెనీలు. మరి వీళ్లకైనా నయనతార ఆఫ్టర్ షూట్ పబ్లిసిటీ చేస్తుందో.. లేక ఎప్పటిలాగే తను ప్రచారం చేస్తే ప్రొడక్ట్ ఫట్ మంటుందని బెదిరిస్తుందో? మరి వీరికి ప్రచారం చేసి.. తర్వాత సినిమాలకు చేయనంటే.. అప్పుడు ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.