Begin typing your search above and press return to search.
మళ్ళీ పిల్లల తల్లివేనా నయనా!!!
By: Tupaki Desk | 17 March 2015 7:00 PM ISTఅభిమానులు ఒకటి కోరుకుంటే.. తాను మరొకటి కోరుకుంటుంది నయనతార. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ కాకుండా, ఏదైనా క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటే చెప్పండి అని అడుగుతుంటుంది. కట్ చేస్తే.. పవర్‌ఫుల్ రోల్స్‌లో సరిగ్గా అమ్మడు ఇరగదీయకపోవడంతో చివరకు గ్లామర్ రోల్సే వస్తున్నాయి. కాని ఈ మధ్య మాత్రం కాస్త ఆర్టు సినిమాల్లో కూడా నటిస్తోంది నయన.
విషయం ఏంటంటే.. తెలుగులో అమ్మడు గ్లామర్ హీరోయిన్‌గా రఫ్ఫాడిస్తూనే తులసి వంటి సినిమాలో పిల్లాడి తల్లిగా యాక్ట్ చేసింది. ఇక శ్రీరామరాజ్యంలో ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లిగా సీత క్యారెక్టరే వేసింది. ఈ మధ్యనే ఈమె తిరిగి మలయాళం సినిమాలోకి అడుగుపెట్టింది అనగానే.. అమ్మడు గ్లామర్‌తో ఇరగతీస్తుందేమో అనుకుంటే, చివరకు అక్కడ కూడా ఇక పిల్లల తల్లిగానే నటించింది. భాస్కర్ ది రాస్కెల్ అనే సినిమాలో నయనకు ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఇలాగైతే ఎలాగమ్మా నయన్? మేం చూద్దామనుకున్న రోల్స్ ఏంటి నువ్వు చేస్తున్న రోల్స్ ఏంటి అంటూ బాధపడుతున్నారు మల్లూ ఫ్యాన్స్. ఇక ఇదే సినిమాలో జెడి చక్రవర్తి విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.