Begin typing your search above and press return to search.

న‌య‌నతార ఇంట్లోకి వ‌చ్చిందెవ‌రు?

By:  Tupaki Desk   |   3 April 2016 7:38 AM GMT
న‌య‌నతార ఇంట్లోకి వ‌చ్చిందెవ‌రు?
X
ఈమ‌ధ్య ఓ రోజు రాత్రి వేళ‌లో న‌య‌న‌తార ఇంట్లోకి అగంత‌కుడు చొర‌బ‌డ్డారా? అత‌డు న‌య‌న్‌ పై దాడి కూడా చేసి పారిపోయాడా? అవున‌నే చెబుతున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు. ఈ విష‌యం గురించి ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోందిప్పుడు. న‌య‌న‌తార హైద‌రాబాద్‌ లో ఉంటే చెన్నైలో ఆమెపై దాడి ఎలా జ‌రుగుతుంద‌ని కొంద‌రు, న‌య‌న‌తార ఇంట్లోకి చొర‌బ‌డింది గుర్తు తెలియ‌ని అగంతుకుడేమీ కాద‌ని, ఆమెకి తెలిసిన‌వాడే అని మ‌రికొంద‌రు మాట్లాడుకుంటున్నారు. మ‌రి వాస్త‌వమేంట‌న్న‌ది తెలియాల్సి వుంది.

న‌య‌న‌తార చెన్నైలోని కోయంబేడు ప్రాంతంలో సొంతంగా ఓ ఆపార్ట్‌ మెంట్ కొని అందులో నివ‌సిస్తోంది. ఈమ‌ధ్య ఒక రోజు రాత్రి న‌య‌న తార ఇంట్లోకి ఓ అగంత‌కుడు చొర‌బ‌డ్డాడ‌ట‌. అది తెలుసుకున్న న‌య‌న‌తార అత‌న్ని ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేసింద‌నీ, గ‌ట్టిగా అరిచింద‌ని, దీంతో న‌య‌న‌తార‌పై దాడి చేసి అత‌ను వెళ్లిపోయాడ‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విష‌య‌మై న‌య‌నతార కానీ, ఆయ‌న స‌హాయ‌కులు కానీ ఎవ్వ‌రూ పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో న‌య‌న‌తార ఇంటికి వ‌చ్చింది ఆమెకి తెలిసిన‌వాడే అయి వుంటాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగుంటుంద‌ని అందుకే ఆ అరుపులు వినిపించుంటాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ న‌య‌న‌తార స‌న్నిహితులు మాత్రం మ‌రో వాద‌న వినిపిస్తున్నారు. న‌య‌న‌తార కొంత‌కాలంగా హైద‌రాబాద్‌ లో ఉంటోంద‌ని, వెంక‌టేష్ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంద‌ని, మ‌రి న‌య‌న్ ఇక్క‌డుంటే చెన్నైలో ఆమెపై దాడి ఎలా జ‌రుగుతుంద‌ని ఈ వార్త‌ల్ని కొట్టి పారేస్తున్నారు. అదీ పాయింటే. వాస్త‌వ‌మేంట‌న్న‌ది న‌య‌న‌కే తెలియాలి మ‌రి!