Begin typing your search above and press return to search.

నయన్.. నీ సెల్ఫీ కేక

By:  Tupaki Desk   |   17 Sept 2015 4:45 PM IST
నయన్.. నీ సెల్ఫీ కేక
X
నయనతారను ఇంతకముందే ఓ సెన్సేషనల్ సెల్ఫీలో చూశాం. తన కొత్త ప్రియుడిగా ప్రచారంలో ఉన్న డైరెక్టర్ విఘ్నేష్ తోనే సెల్ఫీ దిగి అందరికీ షాకిచ్చింది నయన్. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన సెల్ఫీతో జనాల ముందుకొచ్చింది. ఈ మధ్యే ఓ జువెలరీ బ్రాండుకు ప్రచారకర్తగా ఎంపికైన నయన్.. ఆ సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంటూ సెల్ఫీ తీసుకుంది. ఖరీదైన జువెలరీ ముందు నిలుచుని.. సెల్ఫీ స్టిక్ తో మొబైల్ ద్వారా ఫొటో తీసుకుంది నయన్.

బంగారం పోత పోసినట్లున్న పచ్చ రంగు శారీ, ఎరుపు రంగు బ్లౌజ్ లో మెరిసిపోతున్న నయన్.. ఆ సెల్ఫీలో ఎలా ఉందో కానీ.. సెల్ఫీ తీసుకుంటున్న తీరు చూస్తే మాత్రం ముచ్చటేసేస్తుంది. 30 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు మతిపోగొట్టే సౌందర్యంతో ఇలా మెరిసిపోతోంది కాబట్టే ఇంకా ఆమెకు వరుసబెట్టి ఆఫర్ లు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అరడజను దాకా సినిమాల్లో నటిస్తోంది నయన్. దగ్గర దగ్గర రెండు కోట్ల దాకా పారితోషకం పుచ్చుకుంటోందీ మలయాళ భామ. నయన్ తొలిసారి నటించిన హార్రర్ మూవీ ‘మయూరి’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందది.