Begin typing your search above and press return to search.
నయన్ కు మరోసారి ఆ అదృష్టం
By: Tupaki Desk | 11 July 2019 12:44 PM ISTనటీనటులకు డ్రీమ్ రోల్స్ అంటూ ఉంటారు. ప్రతి నటుడు అలాంటి పాత్రలో నటించాలనే కోరికతో ఉంటారు. కొద్ది మందికి మాత్రమే డ్రీమ్ రోల్స్ చేసే అదృష్టం దక్కుతుంది. ఎక్కువ శాతం హీరోయిన్స్ పౌరాణిక సినిమాల్లో సీత పాత్రల్లో నటించాలని కోరుకుంటారు. హుందాతనంతో పాటు నటనకు ఆస్కారం ఉండి మొహంలో ఎక్స్ ప్రెషన్స్ చూపించగలిగే పాత్ర సీతమ్మ పాత్ర. అందుకే సీత పాత్ర డ్రీమ్ రోల్ అంటూ హీరోయిన్స్ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సీతమ్మ పాత్రను రెండవ సారి చేసే అవకాశం నయనతార దక్కించుకోబోతుంది.
కెరీర్ ఆరంభం నుండి పలు వివాదాలను మూట కట్టుకున్న నయనతారకు 'శ్రీరామ రాజ్యం' చిత్రంలో బాలకృష్ణకు జోడీగా సీత పాత్రలో నటించే ఛాన్స్ దక్కడంతో నయనతార సీత పాత్రలో నటించడం ఏంటీ అంటూ కొందరు హిందువులు విమర్శించారు. సీత పాత్రను పోషించేందుకు అర్హత కావాలని ఇద్దరు ముగ్గురిని ప్రేమించిన నువ్వు సీత ఏంటంటూ చాలా మంది బాహాటంగానే విమర్శించారు. అయినా కూడా బాపు ఆమెపై నమ్మకంతో సీతమ్మ పాత్రను ఇవ్వడం జరిగింది. సీత పాత్రలో నయన్ చక్కని నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సారి ఆమెకు సీత పాత్ర ఆఫర్ వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అల్లు అరవింద్.. మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రాలు కలిసి రూ. 1500 కోట్లతో భారీ రామాయణం చిత్రాన్ని మూడు పార్ట్ లుగా 3డిలో నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగు తమిళం మరియు హిందీల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి పలు ఇండియన్ భాషల్లో డబ్బింగ్ చేయాలని నిర్ణయించారు. అందుకోసం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకులైన నితేష్ తివారి మరియు ఉద్యఅవర్ లు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ భారీ చిత్రంలో సీత పాత్ర కోసం నయనతారను సంప్రదించారట. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ బిజీ హీరోయిన్ అయిన నయనతార మరో సారి సీత పాత్ర దక్కడంపై ఎలా స్పందించిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. భారీ ప్రాజెక్ట్ కనుక డేట్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉన్న బిజీ నేపథ్యంలో అన్ని డేట్లు ఇవ్వడం కుదిరేనా చూడాలి. సీత పాత్ర చేసే అదృష్టం మళ్లీ వచ్చిన నేపథ్యంలో నయన్ డేట్లు లేవని వదిలేసుకుంటుందా చూడాలి.