Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: న‌య‌న్.. ఇది నిజంగా రేర్ ఫీట్

By:  Tupaki Desk   |   6 Feb 2022 8:00 AM IST
ట్రెండీ టాక్: న‌య‌న్.. ఇది నిజంగా రేర్ ఫీట్
X
భార్య‌గా న‌టించి చెల్లి గానూ అదే హీరో స‌ర‌స‌న న‌టిస్తే అరుదైన సంద‌ర్భ‌మే అది. ఆడియెన్ రిసీవ్ చేసుకోవ‌డం అన్న‌ది ఈ సంద‌ర్భంలో సంక్లిష్టం. కానీ అలాంటి ప‌రిస్థితిని రానివ్వ‌ని ప్ర‌తిభావంతులైన ప్ర‌భావ‌వంత‌మైన‌ హీరోలు ఉన్నారని ప్రూవ్ అవుతోంది. మిస్స‌మ్మ .. గుండ‌మ్మ క‌థ లాంటి క్లాసిక్స్ లో నాయ‌కానాయిక‌లుగా న‌టించారు ఎన్టీఆర్ - సావిత్రి. కానీ ఆ త‌ర్వాత రక్తసంబంధం సినిమాలో అన్నాచెల్లెళ్లుగా న‌టించి ఆద‌ర‌ణ పొందారు. సోద‌రి సెంటిమెంట్ ఈ సినిమాలో గొప్ప‌గా ఉద్వేగాల్ని పండించింది.

ఇలాంటి ప్ర‌య‌త్నాలు అటు బాలీవుడ్ కోలీవుడ్ లోనూ ఉన్నాయి. ఇక‌పోతే చాలా కాలానికి చిరంజీవి- న‌య‌న‌తార న‌డుమ అలాంటి స‌న్నివేశం రిపీట‌వుతోంది. ఇంత‌కుముందు సైరా- న‌ర‌సింహారెడ్డి చిత్రంలో చిరుకి నాయిక‌గా అల‌రించిన న‌య‌న్ ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ లో చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తోంది. ఒక మిస్ అండ‌ర్ స్టాండింగ్ కార‌ణంగా అన్న‌ను దూరం పెట్టే చెల్లిగా న‌య‌న‌తార క‌నిపిస్తుంది. కానీ చివ‌రికి త‌న సోద‌రి క‌ష్టంలో ఉంద‌ని తెలుసుకుని ఆ అన్న త‌న‌కు సాయ‌ప‌డ‌తాడు. గాడ్ ఫాద‌ర్ లో న‌య‌న‌తార సిస్ట‌ర్ పాత్ర‌ధారి అని తెలియ‌గానే అంతా షాక‌య్యారు. చిరు స‌ర‌స‌న న‌టించి ఇప్పుడు సిస్ట‌ర్ గానా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. కానీ అన్న‌టికీ తెర‌పైనా సమాధాన‌మిస్తారు చిరు. రేర్ ఫీట్ ను రిపీట్ చేస్తూ తెర‌పై అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసే సామ‌ర్థ్యం ఆ ఇద్ద‌రికీ ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర‌స్తుతం చిరు-న‌య‌న్ ల‌పై హైద‌రాబాద్ లో స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం. వచ్చే వారం నుంచి చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారు. లూసీఫ‌ర్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.