Begin typing your search above and press return to search.

నయనతార సినిమా అదిరిపోయిందట

By:  Tupaki Desk   |   11 Nov 2017 9:00 PM IST
నయనతార సినిమా అదిరిపోయిందట
X
లేటు వయసులో నయనతార ఊపు మామూలుగా లేదు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోవడం.. మరోవైపు ప్రభుదేవాతో పెళ్లి వరకు వ్యవహారం వెళ్లడంతో నయనతార కెరీర్ ముగిసిందనే అనుకున్నారంతా. కానీ అతడితో బ్రేకప్ తర్వాత నయన్ దశ తిరిగిపోయింది. వరుసగా హిట్లు కొడుతూ.. క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటూ మళ్లీ తిరుగులేని స్థాయికి చేరుకుందామె. ‘మయూరి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ ఫిలింతో ఆమె ఇమేజే మారిపోయింది. తాజాగా నయన్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ ఫిలిం తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమానే.. ‘ఆరమ్’.

ఈ చిత్రం ఈ శుక్రవారం తమిళంలో మంచి అంచనాల మధ్య రిలీజైంది. నయన్ కలెక్టరు పాత్రలో నటించిన ఈ చిత్రం ఓ సామాజిక సమస్య నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. గోపీ నైనార్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచన రేకెత్తించేలా సాగుతుందని అంటున్నారు. ఈ ఏడాది బెస్ట్ తమిళ్ సినిమా ఇదే అని సమీక్షకులు కితాబిస్తుండటం విశేషం. ముఖ్యంగా నయనతార పెర్ఫామెన్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌ గా అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.