Begin typing your search above and press return to search.

సెల్ఫీ చెబుతున్న ఓ ప్రేమకథ!

By:  Tupaki Desk   |   12 Jun 2015 4:05 AM GMT
సెల్ఫీ చెబుతున్న ఓ ప్రేమకథ!
X
నయనతార హృదయం ఎప్పుడూ ప్రేమకోసం పరితపిస్తుంటుంది. అందుకే ఒకరు దూరమవ్వగానే మరొకరికి తన మనసులో చోటిచ్చేస్తుంటుంది. శింబు, ప్రభుదేవా... ఇలా ఇప్పటికే ఇద్దరు ముగ్గురితో ప్రేమాయణం సాగించింది. ఇప్పుడు మరొక యువ దర్శకుడితో ప్రేమలో పడిందని ప్రచారం సాగుతోంది. ఆ దర్శకుడి పేరు విఘ్నేష్‌ శివన్‌. నయన్‌తో కలిసి సెల్ఫీలో ఉన్నది అతడే.

సెల్ఫీలు తీసుకొన్నంత మాత్రాన ప్రేమలో పడినట్టు కాదు కానీ.. ఈ సెల్ఫీ మాత్రం ఓ ప్రేమకథని చెప్పకనే చెబుతోంది. కలిసి సినిమా చేసే ఏ దర్శకుడు, ఏ కథానాయికా మరీ ఇంత దగ్గరగా నిలబడి సెల్ఫీ తీసుకోరు. కానీ ఇక్కడ వీళ్లు మాత్రం మా హృదయాలు కలిసిపోయాయి అన్నట్టు హార్ట్‌టచింగ్‌ సెల్ఫీ తీసుకొన్నారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో వైరల్‌ అవుతోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ, ఆ విషయాన్ని కూడా త్వరలోనే బయటపెడతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంతన్నది చూడాలి.