Begin typing your search above and press return to search.

నయన్.. తమన్నాలవి 12 అడుగుల చీరలు!

By:  Tupaki Desk   |   24 Sept 2019 3:07 PM IST
నయన్.. తమన్నాలవి 12 అడుగుల చీరలు!
X
మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత 'సైరా' చిత్రానికి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేసిన సంగతి తెలిసిందే. 'సైరా' బ్రిటిష్ కాలంనాటి కథ కావడంతో కాస్ట్యూమ్స్ అప్పటి దుస్తుల శైలిని.. అప్పటి అలవాట్లను ప్రతిబింబించాలి. అందుకే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేయాల్సివచ్చిందని సుష్మిత వెల్లడించారు.

1800 లలో మహిళల ఎలా ఉంటారో అలా హీరోయిన్లు నయనతార.. తమన్నా కనిపించేందుకు 12 అడుగుల పొడవున్న పట్టుచీరలను రెడీ చేసిందట. అయితే అవి వారికి సరిపోతాయా.. బరువు ఎక్కువగా ఉందా.. ఇలాంటివి ముందే చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో తనే స్వయంగా వాటిని కట్టుకొని చూసిందట. ఆ చీరలు ఒకే అనుకున్న తర్వాతే నయన్ కు.. తమన్నాకు ఇచ్చిందట. ఈ సినిమాకోసం రెండేళ్ళు పనిచేయవలసి వచ్చిందని.. భర్తను వదిలి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఉన్నానని.. ఆయనను మిస్ అయ్యానని తెలిపింది.

ఇలాంటి సినిమాకు పని చేయడం ఒక ఛాలెంజింగ్ విషయమని.. టీమ్ అందరి సహకారంతో ఆ పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలిగామని సుష్మిత వెల్లడించారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ విభాగంలో మరో స్టైలిస్టుగా గౌతమ్ మీనన్ సోదరి ఉత్తర మీనన్ పని చేశారట. ఇక కొన్ని దుస్తులకు సెలబ్రిటీ డిజైనర్ అంజు మోడి కూడా పని చేశారని సమాచారం. ఇప్పటికే 'సైరా' లో లీడ్ యాక్టర్స్ ధరించిన దుస్తులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ అయితే ఈ కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనే విషయం క్లారిటీ వస్తుంది.