Begin typing your search above and press return to search.

న‌య‌న‌తార - విఘ్నేష్ శివ‌న్ వెడ్డింగ్ పార్టీ ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   12 May 2022 2:30 AM GMT
న‌య‌న‌తార - విఘ్నేష్ శివ‌న్ వెడ్డింగ్ పార్టీ ఎక్క‌డ‌?
X
కోలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్ విఘ్నేష్ శివ‌న్ - న‌య‌న‌తార గ‌త కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యం తెలిసిందే. వీరి పెళ్లి ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొంత కాలంగా పెళ్లి టాపిక్ ని దాట‌వేస్తూ వ‌స్తున్న ఈ జంట న‌వ‌గ్ర‌హ పూజ‌లు వంటివి చేస్తూ గుళ్లూ గోపురాలు ద‌ర్శిస్తున్నారు. ఈ మ‌ధ్య శ్రీ కాళ‌హ‌స్తిలో న‌వ‌గ్ర‌దోశ పూజ‌ని ప్ర‌త్యేకంగా జ‌రిపించి వార్త‌ల్లో నిలిచిన ఈ జంట ఎట్ట‌కేల‌కు పెళ్లికి రెడీ అయిపోయిందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న ఈ జంట మొత్తానికి జూన్ 9న ఆడంబ‌రంగా వివాహం జేసుకోబోతున్న‌ర‌ని తెలిసింది. తిరుప‌తిలో వీరి వివాహానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ముందు భారీ స్థాయిలో వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా ఆ త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల్ల కేవ‌లం ఇరు కుటుంబాల‌కు సంబంధించిన కుటుంబ స‌భ్యుల మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కానున్నార‌ట‌. పెళ్లి త‌రువాత ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు భారీ స్థాయిలో వెడ్డింగ్ పార్టీని ఈ జంట ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది.

చెన్నైలోనే ప్ర‌త్యేకంగా అతిథులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు విఘ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార ప్ర‌త్యేకంగా భారీ పార్టీని ప్లాన్ చేశార‌ట‌. ఈ పార్టీలో ఈ జంట‌కు అత్యంత స‌న్నిహితులుగా వున్న స్టార్స్ పాల్గొంటార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. గ‌త కొంత కాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న ఈ జంట దాదాపు ఆరేళ్లుగా డేటింగ్ చేస్తోంది. పెళ్లి గురించి ప్ర‌స్థావించిన ప్ర‌తీ సారి స‌మాధానం దాట‌వేస్తూ వ‌చ్చిన ఈ జంట ఫైన‌ల్ గా జూన్ 9 న పెళ్లితో ఒక్క‌టవుతుండటం అభిమానుల‌కు ఆనందాన్ని క‌లిగిస్తోంది.

ఇప్ప‌టికే ఎంగేజ్ మెంట్ ని సీక్రెట్ గా జ‌రుపుకున్న ఈ జంట దీని గురించి అడిగితే మాత్రం ఇది ఎంగేజ్ మెంట్ రింగేన‌ని తెలిపింది. అంతే కాకుండా మేము ప్రైవేట్ వ్య‌క్తుల‌మ‌ని, ఆ కార‌ణంగానే మాకు సంబంధించిన వాళ్ల మ‌ధ్యే ఎంగేజ్ మెంట్ జ‌రుపుకున్నాం. అంతే కాకుండా దీన్ని ప‌బ్లిక్ చేయాల‌నుకోలేదు. పెళ్లికి ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఆ నిర్ణ‌యానికి వ‌చ్చాక త‌ప్ప‌కుండా ఆ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రికీ తెలియ‌జేస్తాం` అని సోష‌ల్ మీడియా వేదిక‌గా వివ‌రించింది.

గ‌త ఏడాదే ఎంగేజ్ మెంట్ గురించి వెల్ల‌డించిన ఈ జంట ఇప్ప‌టికి పెళ్లికి రెడీ అవుతుండ‌టం విశేషం. ఇటీవ‌లే విఘ్నేష్ శివ‌న్ డైరెక్ట్ చేసిన `కాదువాకుల రెండు కాద‌ల్‌` మూవీ విడుద‌లైంది. విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌. స‌మంత హీరో హీరోయిన్ లుగా న‌టించారు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ రాంగ్ టైమ్ లో రిలీజ్ కావ‌డం, స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డంతో ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది.