Begin typing your search above and press return to search.

ఆ వేలు వల్లే నయన్‌ లేడీ సూపర్ స్టార్‌ అయ్యిందా?

By:  Tupaki Desk   |   18 Dec 2020 5:17 PM GMT
ఆ వేలు వల్లే నయన్‌ లేడీ సూపర్ స్టార్‌ అయ్యిందా?
X
లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ను దక్కించుకుని సుదీర్ఘ కాలంగా నెం.1 హీరోయిన్‌ గా కొనసాగుతున్న నయనతార అదృష్టంకు అంతా ఆశ్చర్యపోవాల్సిందే. మూడు ప్రేమ కథలు నడిపిన ఆమెకు జనాల్లో నెగటివిటీ పెరగాలి. కాని ఆమెపై ప్రేక్షకుల్లో అభిమానం మరింత పెరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నయనతార తెలుగు.. తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్‌ హీరోలతో నటించడంతో పాటు హీరోయిన్‌ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసిన ఈ అమ్మడి ఇంతటి అదృష్టంకు కారణం ఆమె చేతికి ఉన్న ఆరవ వేలు అంటున్నారు.

ఎవరికి తెలియని విషయం ఏంటీ అంటే నయనతార ఎడమ చేతికి ఆరవ వేలు ఉంది. ఆ ఆరవ వేలు కారణంగానే అదృష్టం ఆమె వెంటనే ఉంటుందని అంటున్నారు. ఆరవ వేలు ఉన్న వారు ఎంతో అదృష్టవంతులు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కు ఆరవ వేలు ఉంటుంది. ఆ వేలు కారణంగానే ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యాడు అనేవారు ఉన్నారు. ఇప్పుడు నయనతార విషయంలో కూడా అదే జరిగింది. ఈ అమ్మడికి ఉన్న ఎక్ట్సా వేలే ఆమెను సూపర్‌ స్టార్‌ గా నిలిపిందేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.