Begin typing your search above and press return to search.
మెగాస్టార్ హీరోయిన్ గా నయనతార ఫిక్స్?
By: Tupaki Desk | 2 Jan 2021 4:30 PM ISTసినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి యమా స్పీడుగా దూసుకెళ్తున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’తో బిజీగా ఉన్న చిరు.. ఈ ప్రాజెక్టు కంప్లీట్ కాకుండానే.. మరో రెండు సినిమాలను అనౌన్స్ చేసి ఔరా అనిపించారు. అయితే.. సినిమాలు ప్రకటిస్తున్నప్పటికీ.. అందులో హీరోయిన్లను సెట్ చేయడం ఇబ్బందిగా మారింది చిత్ర యూనిట్లకి.
మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ మళయాలం రీమేక్ ‘లూసీఫర్’ కోసం హీరోయిన్ వేటలో పడింది యూనిట్. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ చిత్రానికి స్టార్ హీరోయిన్ నయనతారను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే "సైరా" చిత్రంలో చిరంజీవి సరసన నటించి, తన రాయల్ లుక్ చూపించిన నయనతార.. ఇప్పుడు మరోసారి చిరుతో కలిసి నటించబోతోంది.
ఈ సినిమాలో ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో నయన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిత్ర బృందం నయనతారతో సంప్రదింపులు కూడా జరిపిందని, తుది ఒప్పందం మాత్రమే పెండింగ్‌లో ఉందని టాక్. రెమ్యునరేషన్ ఫిక్స్ అయితే.. నయన్ సైన్ చేయడమే తరువాయి అని తెలుస్తోంది. కాగా.. ఈ రీమేక్ లో చిరంజీవితో కలిసి నటించాలని నటుడు సత్యదేవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. అయితే.. సత్యదేవ్ పాత్ర ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో.. ఏదో ఒక పాత్రలోనైనా చిరుతో నటించాలని తపస్సు చేస్తున్నాడట.
ఇక మిగిలిన పాత్రలకు కూడా నటులను ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. పలువురి పేర్లను ఇప్పటికే చర్చించింది. ఈ వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ మూవీని రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.