Begin typing your search above and press return to search.

పాత గర్ల్ ఫ్రెండ్ తో కొత్త సినిమా

By:  Tupaki Desk   |   17 May 2017 9:45 AM GMT
పాత గర్ల్ ఫ్రెండ్ తో కొత్త సినిమా
X
సౌత్ ఇండస్ట్రిలో ప్రేమ జంటలు తక్కువే. ఇక ఉన్నంతలో చాలావరకు సక్సెసైన ప్రేమ కధలే. కాకపోతే ఇప్పుడు వస్తున్న హీరో హీరోయిన్ ప్రేమలు తొందరగా విడిపోవడం మళ్ళీ ఫ్రెండ్స్ గా కలిసి పనిచేయడం జరుగుతుంది. అలాంటి ప్రేమ కథే సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రభుదేవా లవ్ స్టోరీ. వీళ్ళిద్దరూ చాలా కాలం ప్రేమయాణం నడిపిన తరువాత విడిపోయి ఒకలాంటి సినిమా కథే చూపించారు.

అదంతా ఏమో కాని ఇప్పుడు నయనతార ఒక కొత్త సినిమా ఒప్పుకుంటుందేమో అంటున్నారు. ఈ సినిమాలో ప్రభుదేవాతో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉందట మన బంగారం. అంతకుముందు నయనతార హీరో శింబుతో కూడా లవ్ స్టోరీ నడిపిన సంగతి తెలిసిందే. బ్రేకప్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ అతడితో క కలిసి నటించింది. ఇప్పుడు మరో పాత బోయ్ ఫ్రెండ్ ప్రభుదేవాతో కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్లో నటించబోతుంది. పిజ్జా జిగర్తండా ఫేమ్ డైరెక్టర్ మళ్ళీ మరో వైవిధ్య కథాంశంతో వస్తునట్టు తెలుస్తుంది. ప్రభుదేవా ఇప్పుడు నటుడుగా దర్శకుడుగా చాలా బిజీగా ఉన్నారు. అటు నయనతార కూడా వరుస హిట్ సినిమాలతో అంతే బిజీగా ఉంది. వీళ్ళు విడిపోయాన తరువాత వీళ్ళు కలిసి నటిస్తే సినిమాకు కొత్త క్రేజ్ ఖచ్చితంగా వస్తుందిలే అంటున్నారు తమిళ జనాలు.

అయితే విషయం ఏంటంటే.. ప్రభుదేవాతో బ్రేకప్ అయినప్పటికి.. నయనతార సినిమాల్లో నటించనని చెప్పేసింది. అందరికీ సెండాఫ్‌ ఇచ్చింది కూడా. కాని ప్రేమ పెటాకులు అయ్యాక తిరిగి నటిస్తోంది. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయింది. ఈ సమయంలో వీరి మధ్యన ఇగో క్లాషెస్ రాకుండా ఉంటాయా? చూద్దాం.