Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పక్కన ఆ పాత్రలో అంటే నయనతార ఓకే అంటుందా..??

By:  Tupaki Desk   |   5 Jan 2021 2:10 PM IST
మెగాస్టార్ పక్కన ఆ పాత్రలో అంటే నయనతార ఓకే అంటుందా..??
X
2019లో మోహ‌న్‌లాల్ నటించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌ల‌యాళం మూవీ ‘లూసిఫ‌ర్’. తెలుగులో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. ఇప్పటికే డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమా బాధ్య‌త‌లను స్వీకరించి స్క్రిప్ట్ పనులలో ఉన్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పనులు పూర్త‌య్యాయట. హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ దర్శకత్వం వహించిన ఒరిజిన‌ల్ ‘లూసిఫ‌ర్’ రీమేక్ హ‌క్కులను మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సొంతం చేసుకున్నాడు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై లూసిఫర్ మూవీని నిర్మించనున్నాడు. లూసిఫర్ మలయాళంతో పాటు తెలుగులో డబ్ అయి విడుద‌లైంది కానీ ప్రేక్ష‌కుల వరకు చేరుకోలేకపోయింది. అయినా హీరో పాత్ర‌ను మోహ‌న్‌లాల్ చేసిన విధానం, బ్రిలియంట్ డైరెక్షన్ క్రిటిక్స్‌ను బాగా మెప్పించాయి. అందుకే మ‌ల‌యాళంలో ‘లూసిఫ‌ర్‌’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

స్టార్ యాక్టర్ మోహ‌న్‌ లాల్ నటించిన క్యారెక్టర్ చిరంజీవికి బాగా న‌చ్చి ఆ పాత్ర‌లో నటించాలని ఉత్సాహంగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఒరిజినల్ లూసిఫర్ లో నటి మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనది. అయితే తెలుగు వర్షన్ కోసం ఆ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మెగాస్టార్, నయనతారలు ఆల్రెడీ సైరా సినిమాలో భార్యభర్తలుగా నటించారు. మరి చూడాలి నయనతార నుండి ఎలాంటి సమాధానం రానుందో.. ఇక మెగా అభిమానులు మెగాస్టార్ ను ‘లూసిఫ‌ర్’ రీమేక్‌ లో చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. అటు నయనతార విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది.