Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ భార్య పాత్రలో టాప్ హీరొయిన్?

By:  Tupaki Desk   |   9 March 2018 10:42 AM GMT
వైఎస్ ఆర్ భార్య పాత్రలో టాప్ హీరొయిన్?
X
దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమా గురించి అనఫిషియల్ అప్ డేట్స్ అయితే బయటికి వస్తున్నాయి కాని యూనిట్ నుంచి రావాల్సిన ప్రకటన మాత్రం రావడం లేదు. దీనికి కారణం స్టార్ కాస్ట్ ఇంకా సెట్ కాకపోవడమే అని తెలుస్తోంది. టైటిల్ రోల్ లో తొలుత అక్కినేని నాగార్జున నటిస్తారని కొంత కాలం లేదు లేదు మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఒప్పుకున్నారని మరికొన్ని సార్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దర్శకుడు మహీ రాఘవ దీని గురించి ఎక్కడా చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. దాదాపు మముట్టి సెట్ అయినట్టు ఇన్ సైడ్ టాక్. ఇక ఇందులో తనకు జోడిగా అంటే వైఎస్ఆర్ పాత్రకు భార్య విజయమ్మగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో ముందు నుంచి ఉంది.

విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం నయనతార తో చర్చలు జరుగుతున్నాయని వినికిడి. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకునే నయన్ ఈ సంవత్సరం ప్రారంభంలో బాలకృష్ణ జైసింహ ఒక్కటే చేసింది. సైరా నరసింహరెడ్డి రెండో షెడ్యూల్ లో త్వరలో పాల్గోనబోతోంది. తమిళ్ లో వరస ప్రాజెక్ట్ లతో బిజీ గా నయనతార తెలుగులో మాత్రం కథ బాగా నచ్చితే తప్ప ఓకే చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో మహీ రాఘవ నెరేట్ చేసిన విధానం నచ్చడంతో నయన్ ఆలోచనలో పడినట్టు టాక్. టెక్నికల్ టీంని కూడా ఇంకా సెట్ చేయలేదని తెలిసింది. మొత్తం సెలక్షన్ పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెట్టడానికి ముందు పూర్తి వివరాలు ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. అంత వరకు వైఎస్ఆర్ సినిమా విషయంలో ఈ సస్పెన్స్ భరించక తప్పదు. వైఎస్ఆర్ సరే మరి ఇందులో జగన్ పాత్ర కూడా ఏమైనా ఉంటుందా అని ఫాన్స్ మధ్య చర్చ ముందు నుంచే జరుగుతోంది. యాత్ర అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు వినికిడి.